అత్తభార్యల జంట హత్యల కేసు: యూట్యూబ్ లో సుపారీ కిల్లర్ ను కనిపెట్టి......

By telugu teamFirst Published Jun 30, 2021, 7:29 AM IST
Highlights

తెలంగాణలోని మంచిర్యాల జంట హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. యూట్యూబ్ లో సుపారీ కిల్లర్ ను కనిపెట్టి, అతని జట్టుతో కలిసి యువకుడు ఆ హత్యలు చేసినట్లు తేలింది.

మంచిర్యాల: మంచిర్యాల బృందావన్ కాలనీలో ఈ నెల 18వ తేదీన జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. పరిచయం ఏ మాత్రం లేని వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ఏకమై జంట హత్యలకు పాల్పడినట్లు తేలింది. తద్వారా వారు పోలీసులకు దొరికిపోయారు. 

మహిళ వూదరి విజయలక్ష్మి (4), ఆమె కూతురు రవీనాలను ఈ నెల 18వ తేదీన దుండగులు హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ మంగళవారం వెల్లడించారు. నిజామాబాద్ జిల్ాల బోధన్ కు చెందిన అరుణ్ కుమార్, మంచిర్యాలకు చెందిన రవీనాలు ప్రేమ వివాహం చేసుకున్నారు. నిరుడు జూన్ లో వారి పెళ్లి జరిగింది.

అయితే, కట్నం తేవాలంటూ అరుణ్ కుమార్ రవీనాను వేధిస్తూ వచ్చాడు. దీంతో రవీనా తన పుట్టింటికి వెళ్లింది. రవీనా అప్పటికి గర్భవతి. అయితే, తల్లి విజయలక్ష్మి ఆమెకు అబార్షన్ చేయించింది. దీంతో వారిద్దరిపై అరుణ్ కుమార్ కక్ష కట్టాడు. ఇద్దరిని కూడా చంపేయాలని అనుకున్నాడు.

హత్య ఎలా చేయాలని ఆలోచిస్తున్న క్రమంలో అరుణ్ కుమార్ కు యూట్యూబ్ లో సుపారి కిల్లర్ విజయవాడ అనే ఐడి కనిపించింది. ఆయుధాలు విక్రయిస్తాం, సుపారీ తీసుకుని హత్య చేస్తాం, కిడ్పాప్ లు చేస్తాం అని రాసి ఉంది. ఓ ఇంటర్నేషనల్ నెంబర్ ఇచ్చి తమను సంప్రదించవచ్చునని ఉంది. దాంతో అతను ఆ నెంబర్ ను అరుణ్ కుమార్ సంప్రదించాడు. 

అవతలి వ్యక్తి తనను బిట్టుగా పరిచయంచేసుకున్నాడు. హత్యలకు రూ. 10 లక్షలు కావాలని బిట్టు అరుణ్ కుమార్ ను అడిగాడు. తన అత్తగారింటిలో రూ. 4లక్షల నగదు, 20 తులాల బంగారం నగలు ఉంటాయని హత్య చేసి వాటిని తీసుకుని వెళ్లాలని చెప్పాడు. అందుకు బిట్టు సరేనన్నాడు. 

తెనాలికి చెందిన సుబ్బుతో కలిసి ఈ నెల 17వ తేదీన బిట్టు మంచిర్యాలకు చేరుకున్నాడు. అరుణ్ వారిని కలుసుకున్నాడు. ఈఠ నెల 18వ తేదీ తెల్లవారు జామమున 3 గంటలకు ఇంటి గోడ దూకి మేడపైకి వెళ్లి కాపు కాశారు. ఉదయం 5 గంటలకు నీళ్ల కోసం బయటకు వచ్ిచన విజయలక్ష్మిపై ముగ్గురు దాడి చేశారు. మెడకు తాడు బిగించి ఆమెను చంపేశారు. ఆ అలికిడికి రవీనా నిద్ర లేచింది. ఆమెను అదే పద్ధతిలో చంపేశారు. ఆ తర్వాత ఇద్దరిపై ఉన్న నగలను తీసుకుని పారిపోయారు. మంచిర్యాల పోలీసులు ఈ నెల 28వ తేదీన అరుణ్ కుమార్ ను, అతను ఇచ్చిన సమాచారంతో బిట్టు, సుబ్బులను అరెస్టు చేశారు. 

click me!