తెలంగాణలో మరోసారి వెయ్యి లోపే కేసులు.. నారాయణపేటలో అత్యల్పం

Siva Kodati |  
Published : Jun 29, 2021, 09:31 PM IST
తెలంగాణలో మరోసారి వెయ్యి లోపే కేసులు.. నారాయణపేటలో అత్యల్పం

సారాంశం

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,21,236 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 987 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,22,593కు చేరింది

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,21,236 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 987 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,22,593కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్‌తో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి వైరస్ వల్ల ఇప్పటి వరకు తెలంగాణలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,651కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,362 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,05,455కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 13,487 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 60, జీహెచ్ఎంసీ 130, జగిత్యాల 25, జనగామ 7, జయశంకర్ భూపాలపల్లి 18, గద్వాల 2, కామారెడ్డి 4, కరీంనగర్ 52, ఖమ్మం 102, ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 11, మహబూబాబాద్ 40, మంచిర్యాల 52, మెదక్ 5, మేడ్చల్ మల్కాజిగిరి 46, ములుగు 19, నాగర్ కర్నూల్ 9, నల్గగొండ 69, నారాయణపేట 2, నిర్మల్ 3, నిజామాబాద్ 10, పెద్దపల్లి 51, సిరిసిల్ల 27, రంగారెడ్డి 42, సిద్దిపేట 24, సంగారెడ్డి 18, సూర్యాపేట 64, వికారాబాద్ 6, వనపర్తి 7, వరంగల్ రూరల్ 23, వరంగల్ అర్బన్ 38, యాదాద్రి భువనగిరిలో 16 చొప్పున కేసులు నమోదయ్యాయి. 


 

PREV
click me!

Recommended Stories

చైనీస్ మాంజాపై సజ్జనార్ కొరడా | Sajjanar Strong Warning on Chinese Manja Sales | Asianet News Telugu
Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu