కాంగ్రెస్‌ వార్ రూమ్ కేసు.. సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు సునీల్ కనుగోలు టీమ్ గైర్హాజరు..!

Published : Dec 26, 2022, 03:31 PM IST
కాంగ్రెస్‌ వార్ రూమ్ కేసు.. సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు సునీల్ కనుగోలు టీమ్ గైర్హాజరు..!

సారాంశం

కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా వార్‌ రూమ్‌ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉన్న శ్రీ ప్రతాప్‌, శశాంక్‌ కాకినేని, ఇషాంత్‌ శర్మలు కూడా విచారణకు దూరంగా ఉన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా వార్‌ రూమ్‌ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులకు సంబంధించి మాదాపూర్‌లోని ఎన్నికల వ్యుహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి చేసిన పోలీసులు.. అక్కడ పనిచేస్తున్న మోండా శ్రీ ప్రతాప్‌, శశాంక్‌ కాకినేని, ఇషాంత్‌ శర్మలను అదుపులోకి తీసుకన్న సంగతి తెలిసిందే. వారి నుంచి కొంత సమాచారం సేకరించిన అనంతరం విడుదల చేశారు. ఈ కేసులో సునీల్ కనుగోలును ప్రధాన నిందితుడిగా చేర్చారు. సునీల్‌ కనుగోలుతో పాటు ఆ ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేశారు. 

అయితే సునీల్ కనుగోలు ఇప్పటి వరకు పోలీసులకు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉన్న శ్రీ ప్రతాప్‌, శశాంక్‌ కాకినేని, ఇషాంత్‌ శర్మలు కూడా విచారణకు దూరంగా ఉన్నారు. తాము హాజరుకాలేమని చెప్పిన ఆ ముగ్గురు సైబర్ క్రైమ్ అధికారులను మరో 10 రోజుల గడువు కోరినట్లు తెలుస్తోంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు