కామారెడ్డిలో గురుకుల విద్యార్థిని సూసైడ్.. తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన..

By Asianet News  |  First Published Nov 1, 2023, 11:42 AM IST

కామారెడ్డి జిల్లాలో ఓ గురుకుల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో బలవన్మరణానికి ఒడిగట్టింది. అయితే ఆమె మరణంపై అనుమానాలు ఉన్నాయని బాధితురాలు బంధువులు ఆందోళన చేశారు. పోలీసులు వారిని శాంతింపజేశారు.


కామారెడ్డి జిల్లాలో ఓ గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్ గదిలోనే ఆమె ఆత్మహత్యకు చేసుకుంది. దసరా సెలవుల కోసం ఇంటికి వెళ్లి వచ్చిన మరుసటి రోజే ఈ ఘోరానికి ఒడిగట్టింది. అయితే బాలిక మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి 22 మందికి గాయాలు..

Latest Videos

పోలీసులు తెలిపిన వివరాలు, ‘ఈనాడు’ కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలం పెద్దఎక్లార గేట్‌ వద్ద సోషల్ వెల్పేర్ బాలిక గురుకుల పాఠశాల ఉంది. అందులో బిచ్కుంద మండలానికి చెందిన 16 ఏళ్ల ఓ విద్యార్థిని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. దసరా పండగ రావడంతో సెలవులకు అందరితో పాటు ఆమె కూడా ఇంటికి వెళ్లింది.

సెలవులు ముగియడంతో సోమవారం సాయంత్రం హాస్టల్ కు వచ్చింది. అయితే మంగళవారం ఉదయం టిఫిన్ తినేందుకు వెళ్లలేదు. స్నేహితులు అడిగితే తనకు హెల్త్ బాగాలేదని, మీరు వెళ్లి తినాలని సూచించింది. అయితే తరువాత క్లాస్ రూమ్ లో టీచర్ అటెండెన్స్ తీసుకున్నారు. దీంతో ఆ విద్యార్థి కనిపించలేదు. ఏం జరిగిందో తెలుసుకుందామని బాలిక ఉండే గదికి వెళ్లి చూశారు.

జమ్మూకాశ్మీర్ లో దారుణం.. ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు మృతి..

ఆ బాలిక గదిలోనే ఆత్మహత్యకు పాల్పడి కనిపించింది. దీంతో ప్రిన్సిపల్ పోలీసులకు, అలాగే బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బాలిక మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని వారంతా అక్కడ ఆందోళన చేశారు. 

గాలి బుడగలా ఎగురుతున్నావే చెల్లెమ్మా!.. పురంధేశ్వరిపై విజయసాయి సెటైర్...

దీనిపై సమాచారం అందుకున్న బాన్సువాడ డీఎస్పీ, బిచ్కుంద సీఐ, ఎస్ ఐ, అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులకు నచ్చజెప్పారు. కేసు నమోదు చేసుకొని, దీనిపై సమగ్ర విచారణ చేస్తామని నిరసనకారులకు హామీ ఇచ్చారు. దీంతో వారు శాంతించి, ఆందోళన వివరమించారు. 

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.
 

click me!