షాక్: కేటీఆర్ ర్యాలీలో నేరెళ్ల బాధితుల ఆత్మహత్యాయత్నం

By pratap reddyFirst Published Dec 1, 2018, 8:11 AM IST
Highlights

తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఆపద్ధర్మ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కేటీ రామారావుకు అవాంఛనీయమైన సంఘటన ఎదురైంది. సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగెళ్లపల్లి ర్యాలీలో శుక్రవారం ఇద్దరు నేరెళ్ల బాధితులు ఆత్మహత్యాయత్నం చేశారు. 

సిరిసిల్ల: తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఆపద్ధర్మ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కేటీ రామారావుకు అవాంఛనీయమైన సంఘటన ఎదురైంది. సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగెళ్లపల్లి ర్యాలీలో శుక్రవారం ఇద్దరు నేరెళ్ల బాధితులు ఆత్మహత్యాయత్నం చేశారు. 

తమ శరీరాలపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించారు. ఇసుక మాఫియాకు చెందిన లారీలు స్థానికులపై నుంచి దూసుకెళ్లి చంపేశాయని నిరసనకారులు విమర్శించారు. 

రెండేళ్లయినా తమకు ప్రభుత్వం న్యాయం చేయలేదని బర్తు బానయ్య,  కోలా హరీష్ ఆరోపించారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు పోలీసులు తమను చిత్రహింసలు పెట్టారని వారన్నారు. 

ఆ ఇద్దరి ఆత్మహత్యాయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వారిని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆరుగురు నేరెళ్ల బాధితుల్లో నలుగురు టీఆర్ఎస్ లో చేరి కేటీ రామారావు తరఫున ప్రచారం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సిరిసిల్లలో కేటీఆర్ పై నేరెళ్ల సంఘటన దెబ్బ?

నేరెళ్ల బాధితులకు ఇలా ట్రీట్ మెంట్ చేసినం

నేరెళ్ల దళితులకు లాఠీఛార్జి దెబ్బలేనట

నేరెళ్ల ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం

నేరెళ్ల ఘటనపై డీజీపీ అనురాగ్ శర్మకి నోటీసు

కెటిఆర్ కు నేరెళ్ల గుబులు

నేరెళ్ల తిట్లన్నీ మాకు దీవెనలే

నేరెళ్ల హింస మీద మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు

click me!