
తెలంగాణలో ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లను 12 శాతంకు పెంచాలని సుధీర్ కమిషన్ తన తుది నివేదికలో ప్రభుత్వానికి సూచించింది.
ముఖ్యంగా మెహర్ వంటి వెనకబడిన ముస్లిం కులాలను ఎస్సీలో చేర్చి, రిజర్వేషన్లు కల్పించాలి కోరింది.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముస్లింల రిజర్వేషన్ల పెంపుపై సుధీర్ కమిషన్ ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలోని ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఈ కమిషన్ తుది నివేదికను రాష్ట్రప్రభుత్వం వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
రాష్ట్ర ముంస్లిలలో 85శాతం మంది వెనుకబడినవారున్నారని కమిషన్ పేర్కొంది. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను కల్పించవచ్చని కమిషన్ సూచించింది.
రిజర్వేషన్లు పెంచేలా రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరవచ్చని సూచించింది. ముస్లింల అభివృద్ధికి 12 సిఫార్సులపై చర్యలు తీసుకోవలసిన సూచించింది.