గ్రూప్-2 పరీక్ష వాయిదాకోరుతూ విద్యార్థుల ర్యాలీ, అరెస్ట్: ఓయూలో ఉద్రిక్తత

By narsimha lode  |  First Published Aug 8, 2023, 2:48 PM IST

గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.  ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న విద్యార్థులను  పోలీసులు అరెస్ట్  చేశారు. 



హైదరాబాద్:  గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని  ఓయూలో విద్యార్థుల  ఆందోళనకు దిగారు. ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.  గ్రూప్-2 పరీక్షలతో పాటు , గురుకుల పరీక్షలు  కూడ విషయాన్ని విద్యార్థులు గుర్తు  చేస్తున్నారు. ఒకే నెలలో  రెండు పరీక్షలు నిర్వహించడంతో  తమకు  ఇబ్బందులు ఎదురౌతున్నాయని వారు చెప్పారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ  ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్  చేశారు.ఈ సమయంలో పోలీసులతో  విద్యార్థులు  వాగ్వాదానికి దిగారు. దీంతో  ఉస్మానియా యూనివర్శిటీ  ఆర్ట్స్ కాలేజీ వద్ద  ఉద్రిక్తత  చోటు  చేసుకుంది.

టీఎస్‌పీఎస్‌సీ ఈ నెల  29, 30 తేదీల్లో  గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనుంది. గత ఏడాది డిసెంబర్  మాసంలో ఈ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది. 783 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు  రాష్ట్రప్రభుత్వం గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనుంది. 

Latest Videos

టీఎస్‌పీఎస్‌సీలో  గతంలో నిర్వహించిన పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. ఈ విషయం  ఈ ఏడాది మార్చి మాసంలో వెలుగు చూసింది.  దీంతో  కొన్ని పరీక్షలను  టీఎస్‌పీఎస్‌సీ  వాయిదా వేసింది. మరికొన్ని పరీక్షలను  టీఎస్‌పీఎస్‌సీ రద్దు చేసింది. ఈ విషయమై  విచారణకు  రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు  చేసింది. సిట్ ఇప్పటికే  చార్జీషీట్ దాఖలు చేసింది. ఇప్పటికే 90 మందిని అరెస్ట్  చేశారు. ఇంకా  మరికొందరిని అరెస్ట్  చేసే అవకాశం ఉందని  సమాచారం. మరో వైపు ఈ కేసులో  అనుబంధ చార్జీషీట్ దాఖలు చేయనున్నారు.

click me!