కామారెడ్డిలో విద్యార్థుల అరెస్టు

Published : Aug 17, 2017, 08:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
కామారెడ్డిలో విద్యార్థుల అరెస్టు

సారాంశం

జెఎసి సభను అడ్డుకున్నందుకు విద్యార్థుల నిరసన ధర్నా చేస్తున్న విద్యార్థుల అరెస్టు రాత్రి వరకు విద్యార్థులను వదలని పోలీసులు

కామారెడ్డిలో ఎమ్మెల్యే గంపా గోవర్దన్ ఇంటి ముందు ధర్నా చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ జెఎసి తలపెట్టిన అమరుల స్పూర్తి యాత్ర సభా ప్రాంగణాన్ని టిఆర్ఎస్ కార్యకర్తలు కూలగొట్టిన విషయం తెలిసిందే. టెంట్లు కూలగొట్టి, కుర్చీలు విరగ్గొట్టి ఆగమాగం చేశారు టిఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి లోకం అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకుని కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్దన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం 8 గంటల వరకు విద్యార్థులను పోలీసులు వదిలిపెట్టలేదు. దీంతో కామారెడ్డి జిల్లాలో సర్వత్రా ఆందోళన నెలకొంది. విద్యార్థులను పోలీసులు ఏం చేస్తారోనని జెఎసి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్