
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో మరో కారు బీభత్సం సృష్టించింది. TS 09 EB 6049 నంబరు గల ఐ20 కారు.. వేగంగా దూసుకొచ్చి డివైడర్ ను ఢీ కొట్టింది. ఆ కారు నడుపుతున్న విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 మసీదు జంక్షన్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే గతంలో రమ్య యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంతో మళ్లీ ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు అందరూ.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో ముక్ఫంజా కాలేజీ కి చెందిన విద్యార్థులలో ఒకరు ఈ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు పార్జత్ అలీ (19)గా, గాయపడిన వ్యక్తి బానిష్ (23) గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని సోమాజిగూడ యశోద ఆసుపత్రి కి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.