హైదరాబాద్ ఎల్‌బీనగర్ జంక్షన్‌లో కాంగ్రెస్ కార్యకర్త శనివారం ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ ర్యాలీ సందర్భంగా ఎల్బీనగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించేందుకు కాంగ్రెస్ నేతలు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు భారీగా తరలివచ్చారు.
హైదరాబాద్ ఎల్‌బీనగర్ జంక్షన్‌లో కాంగ్రెస్ కార్యకర్త శనివారం ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ ర్యాలీ సందర్భంగా ఎల్బీనగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించేందుకు కాంగ్రెస్ నేతలు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు భారీగా తరలివచ్చారు. ఈక్రమంలో కాంగ్రెస్ కార్యకర్త, విద్యార్ధి కల్యాణ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా వందలాది మంది కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో ఎల్బీనగర్- ఉప్పల్ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అయితే కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అటు లాఠీఛార్జ్‌ను కవర్ చేస్తున్న జర్నలిస్టులపైనా పోలీసులు దాడి చేశారు. పోలీసుల లాఠీచార్జీలో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి వెంకట్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు.