
వరంగల్ జిల్లాలో ఓ వికృతమైన చర్య కెమెరాకు చిక్కింది. తోపుడు బండిపై ఐస్ క్రీం, ఫలూదా, ఇతర డిజర్ట్స్‌ను అమ్మే ఓ దుండగుడు దారుణమైన పని చేశాడు. తోపుడు బండి వద్దే నిలబడి హస్త ప్రయోగం చేసుకుని ఐస్ క్రీంలో తన వీర్యం కలిపాడు. ఈ ఘటనను ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటన వరంగల్‌లోని నెక్కొండ ఏరియాలో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే ఆహార భద్రత అధికారులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తక్షణమే రంగంలోకి దూకారు. బాలాజీ అని పేరున్న ఆ ఐస్ క్రీం స్టాల్ వద్దకు చేరుకున్నారు. ఐస్ క్రీంను కలుషితం చేసి అమ్ముతున్న ఆ దుండగుడిని, అందులో ప్రమేయం ఉన్న ఇతరులనూ అదుపులోకి తీసుకున్నాడు.