ఏడు ప్రాజెక్టులు: కేసీఆర్‌కు గజేంద్ర షెకావత్ షాకింగ్ లెటర్

By narsimha lodeFirst Published Dec 14, 2020, 10:53 AM IST
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టుకు మూడో టీఎంసీ తరలింపు విషయమై సంబంధించిన పనులు సహా గోదావరిపై తెలంగాణ  చేపడుతున్న ఏడు ప్రాజెక్టులపై డీపీఆర్ నివేదికలు లేకుండా ముందుకు వెళ్లరాదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశాడు.


హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు మూడో టీఎంసీ తరలింపు విషయమై సంబంధించిన పనులు సహా గోదావరిపై తెలంగాణ  చేపడుతున్న ఏడు ప్రాజెక్టులపై డీపీఆర్ నివేదికలు లేకుండా ముందుకు వెళ్లరాదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశాడు.

ఈ ఏడాది అక్టోబర్ 6వ తేదీన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలను కూడ ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 11వ తేదీన సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి షెకావత్ ను కలిసి చర్చించారు. అదే రోజున కేంద్ర మంత్రి కేసీఆర్ కు లేఖ రాశాడు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చేపట్టిన కొత్త ప్రాజెక్టులను ఆపాలని ఆయన కోరారు.  డీపీఆర్ లు లేకుండానే  ప్రాజెక్టు నిర్మాణాలను చేపట్టొద్దని ఆయన మరోసారి కోరారు.కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి అనుమతులను తీసుకోవాలని ఆయన సూచించారు.

కేంద్ర జల సంఘం (సీడబ్ల్యుసీ), గోదావరి బోర్డుల నుండి కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి అనుమతులు తీసుకోవాలని ఆయన కోరారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరి నుండి రోజూకు 2 టీఎంసీల నీటిని తరలించేందుకు తెలంగాణకు అనుమతి ఇచ్చిన విషయాన్ని కేంద్ర మంత్రి ఒప్పుకొన్నారు. అయితే మూడో టీఎంసీ విషయమై మాత్రం అనుమతివ్వలేదన్నారు.

మూడో టీఎంసీ పనులకు అనుమతులను తీసుకోలేదన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుండి అవసరమైన హైడ్రాలజీ, అంతరాష్ట్ర ఇన్వెస్ట్ మెంట్ పర్యావరణ అనుమతులు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు.


పోతిరెడ్డిపాడు పనులను నిలిపివేయాలి

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనుల్ని కూడా చేపట్టకూడదని కేంద్ర మంత్రి షెకావత్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. కేడబ్ల్యూడీటీ-1 ఏపీ పునర్వవ్యస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న ప్రాజెక్టులు మినహా అన్ని ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్లొద్దని కేంద్రం, కృష్ణాబోర్డు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపును నిరసిస్తూ  తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

click me!