ప్రాణం తీసిన టిప్పు.. రాడ్ తో తలమీద మోది హత్య...

By AN TeluguFirst Published Dec 14, 2020, 10:07 AM IST
Highlights

ఫంక్షన్ అయ్యాక ఇచ్చిన టిప్పు కోసం ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ చివరికి ఒకరి హత్యకు దారి తీసింది. మరొకరిని నిందితుడిని చేసింది. డబ్బు ఎంత పనైనా చేయిస్తుందనడానికి తాజా ఉదాహరణగా నిలిచిన దారుణ ఘటన హైదరాబాద్ చిలకలగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

ఫంక్షన్ అయ్యాక ఇచ్చిన టిప్పు కోసం ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ చివరికి ఒకరి హత్యకు దారి తీసింది. మరొకరిని నిందితుడిని చేసింది. డబ్బు ఎంత పనైనా చేయిస్తుందనడానికి తాజా ఉదాహరణగా నిలిచిన దారుణ ఘటన హైదరాబాద్ చిలకలగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన పండిట్‌ సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ వద్ద దినసరి కూలీ. వారాసిగూడలోని ఓ ఫంక్షన్‌లో ఏడునెలల క్రితం పనిలో చేరాడు. క్లాక్‌టవర్‌ వద్ద పరిచయం ఉన్న ఆనంద్‌(40)ను వారం రోజుల క్రితం అదే ఫంక్షన్‌హాలులో పనిలో చేర్పించాడు. 

లాలాపేట్‌కు చెందిన ఓ కుటుంబం ఈ నెల 12న రాత్రి ఫంక్షన్‌హాలులో సంగీత్‌ ఫంక్షన్ చేసుకున్నారు. అర్ధరాత్రి ఫంక్షన్ అయిపోయాక వెళ్లిపోతూ ఆనంద్‌కు  టిప్పు కింద కొన్ని డబ్బులు ఇచ్చారు. ఈ విషయం పండిట్ కి తెలిసింది. ఈ టిప్పు డబ్బులు పంచుకునే విషయంలో పండిట్‌, ఆనంద్‌ మధ్య వివాదం చేలరేగింది. అప్పటికే  మద్యం తాగి ఇద్దరు గట్టిగా కేకలు వేసుకుంటూ గొడవకు దిగడంతో అక్కడే ఉన్న మరో వర్కర్‌ పోచమ్మ వారికి సర్దిచెప్పి వెళ్లిపోయింది.

ఆమె వెళ్లిపోయాక మళ్లీ ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. మద్యం మత్తులో ఉన్న పండిట్‌ ఇనుపరాడ్‌తో ఆనంద్‌ తలపై కొట్టడంతో కిందపడిపోయాడు. అనంతరం దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆదివారం ఉదయం పదకొండు గంటల సమయంలో నిర్వాహకులు వచ్చి చూడగా తలపై గాయాలతో ఆనంద్‌ విగతజీవిగా పడి ఉన్నాడు. 

సమాచారమందుకున్న పోలీసులు, డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీం బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆదివారం తెల్లవారుజామున 2:30నిమిషాల సమయంలో పండిట్‌, ఆనంద్‌పై దాడి చేసిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి. 

ఫంక్షన్‌హాలు యజమాని సయ్యద్‌ఫైజర్‌ ఫిర్యాదు మేరకు హత్య కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు, నిందితుడి చిరునామా, పూర్తి వివరాల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి తెలిపారు.

click me!