టీఆర్ఎస్‌కు షాక్.. మునుగోడులో ‘‘గొర్రెల పంపిణీ’’ నగదు జమకు ఈసీ బ్రేక్, బీజేపీ పనేనన్న తలసాని

Siva Kodati |  
Published : Oct 19, 2022, 03:44 PM IST
టీఆర్ఎస్‌కు షాక్.. మునుగోడులో ‘‘గొర్రెల పంపిణీ’’ నగదు జమకు ఈసీ బ్రేక్, బీజేపీ పనేనన్న తలసాని

సారాంశం

మునుగోడు ఉపఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మునుగోడులో గొర్రెల పంపిణీకి బదులుగా ప్రభుత్వం చేస్తోన్న నగదు జమను తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది . ఇటీవలే గొర్రెల పంపిణీకి సంబంధించిన పథకాన్ని నగదు జమగా తెలంగాణ సర్కార్ మార్చిన సంగతి తెలిసిందే. 

మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. మునుగోడులో గొర్రెల పంపిణీకి బదులుగా ప్రభుత్వం చేస్తోన్న నగదు జమను తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. అయితే దీనిపై టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ ఫిర్యాదుతోనే నగదు జమను ఈసీ నిలిపివేసిందని తలసాని ఆరోపించారు. ఎన్నికల తర్వాత యథావిధిగా నగదు జమను కొనసాగిస్తామని మంత్రి పేర్కొన్నారు. 

కాగా...  గొర్రెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీకి మారుస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వుల ప్రకారం.. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో లబ్దిదారులకు గొర్రెల పంపిణీకి బదులు.. నగదు బదిలీ చేపట్టనుంది. ఇందుకు సంబంధించి అక్టోబర్ 1వ తేదీనే సర్కార్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెల కొనుగోళ్లకు సమయం పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గొర్రెల పంపిణీలో జాప్యాన్ని నివారించడానికి.. గొల్ల/కురుమ సంఘం సభ్యులు సొంతంగా గొర్రెలను కొనుగోలు చేసేలా ప్రత్యక్ష నగదు ప్రయోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నాయి. అయితే రెండు జిల్లాలను పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. పైలట్ ప్రాజెక్టు కింద మునుగోడు నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది.

ALso REad:గొర్రెల పంపిణీకి బదులుగా డైరెక్ట్‌గా అకౌంట్లోకే డబ్బులు.. మునుగోడు ఉప ఎన్నిక వేళ సర్కార్ కీలక ఉత్తర్వులు..

రెండో విడత గొర్రెల పంపిణీ పథకానికి ఎంపికైన లబ్దిదారులకు.. సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేయాలని నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నల్గొండ జిల్లాలో 5,600 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,000 మంది లబ్ధిదారులకు మొత్తం 93.76 కోట్ల రూపాయల నగదు ప్రయోజనం పొందనున్నారు. అయితే మొత్తం 7,600 మంది లబ్దిదారులు కూడా మునుగోడు నియోజకవర్గానికి చెందినవారే. యాద్రాద్రి జిల్లాలోని చౌటప్పుల్, నారాయణపురం మండలాల్లో 2 వేల మంది.. నల్గొండ జిల్లాలోని మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాల్లో 5,600 మంది లబ్దిదారులు ఉన్నారు. 

గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ప్రభుత్వం రూ.1.75 లక్షలతో.. ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు, ఒక పొట్టేలును  పంపిణీ చేస్తున్నసంగతి తెలిసిందే. ఇందులో లబ్ధిదారుడు 25 శాతం లేదా రూ.43,750 జమ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం రూ.1,31,250 జమ చేస్తుంది. ఇప్పుడు గొర్రెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీగా మార్చిన నేపథ్యంలో..  ప్రభుత్వం తన వాటా రూ. 1,31,250 నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేస్తుంది. ఈ మొత్తాన్ని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu