సింగ‌రేణిలో 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని ఆపండి - ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ

By team teluguFirst Published Dec 8, 2021, 9:02 PM IST
Highlights

సింగరేణిలో పరిధిలోని నాలుగు కోల్ బ్లాక్స్ ను  కేంద్ర ప్రభుత్వం వేలం వేయాలని భావిస్తోందని, ఆ నిర్ణయాన్ని నిలిపివేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ఈ మేరకు ప్రధానికి లేక రాశారు. 

కేంద్ర ప్రభుత్వ నిర్వహించ తలపెట్టిన నాలుగు కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర  ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి బుధ‌వారం సాయంత్రం లేఖ రాశారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుండి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాయి. ఈ సమ్మె మూడు రోజుల పాటు ఉంటుందని పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానికి సీఎం లేఖ రాశారు. తెలంగాణలోని సింగరేణి ఏడాదికి 65 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గును ఉత్ప‌త్తి చేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే బొగ్గు వల్ల ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో గల థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలు తీరుతున్నాయని తెలిపారు. అక్కడున్న థర్మల్ పవర్ సేష్టన్ల అవసరాలను సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

https://telugu.asianetnews.com/telangana/election-commission-serious-on-telangana-govt-over-local-body-leaders-salaries-hike-r3qy2d

తెలంగాణ  రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ జూన్ 2014లో 5,661 మెగావాట్లు ఉందని తెలిపారు. తరువాత 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. కాబట్టి విద్యుత్ తయారు చేసేందుకు బొగ్గు సరఫరా అవసరమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం  వేలం వేయాలని భావించిన జేబిఆర్ఓసి-3, శ్రావన్ పల్లి ఓసి, కోయగూడెం ఓసి-3 మరియు కెకె -6 యుజి బ్లాక్ ల వల్ల సింగరేణి అవసరాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి వేలం వేయాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. 
 

click me!