బ్యాలెట్ పద్దతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఎస్ఈసీ మొగ్గు?

By narsimha lodeFirst Published Oct 5, 2020, 4:28 PM IST
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ ద్వారానే నిర్వహించేందుకు మొగ్గు చూపుతోంది. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 


హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ ద్వారానే నిర్వహించేందుకు మొగ్గు చూపుతోంది. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ విషయమై ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం  పలు రాజకీయ పార్టీలతో ఇటీవల సమావేశమైంది.
ఎన్నికల నిర్వహణ విషయమై ఆయా పార్టీల అభిప్రాయాలను  రాష్ట్ర ఎన్నికల సంఘం తెలుసుకొంది. 

కరోనా నేపథ్యంలో  బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహణకు మెజారిటీ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఈవీఎంల వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని  పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో బ్యాలెట్ పద్దతిలో  ఎన్నికలు నిర్వహణకు మెజార్టీ పార్టీలు సానుకూలంగా స్పందించాయి.

మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో కూడ బ్యాలెట్ పద్దతినే ఉపయోగించే అవకాశం లేకపోలేదు.ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ఉంది. బీజేపీ నేతలు ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఈ మేరకు ఎమ్మెల్సీ రామచంద్రారావు ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తే రిగ్గింగ్ చేసుకొనేందుకు అధికార పార్టీకి వెసులుబాటు దక్కుతోందని బీజేపీ ఆరోపించింది. ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ కోరింది.
 

click me!