ఫాంహౌజ్ లో కేసీఆర్ ముందస్తు మంతనాలు

Published : Sep 04, 2018, 02:42 PM ISTUpdated : Sep 09, 2018, 01:23 PM IST
ఫాంహౌజ్ లో  కేసీఆర్ ముందస్తు మంతనాలు

సారాంశం

తెలంగాణ సచివాలయం వేదికగా మంగళవారం నాడు  పలువురు కీలక అధికారులు సమావేశం జరిగింది. ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకొని ఈ సమావేశాలను ప్రాధాన్యత ఏర్పడింది.

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం వేదికగా మంగళవారం నాడు  పలువురు కీలక అధికారులు సమావేశం జరిగింది. ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకొని ఈ సమావేశాలను ప్రాధాన్యత ఏర్పడింది.

తెలంగాణ సచివాలయంలో  సీఎస్ ఎస్ కే జోషీతో  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  రజత్ కుమార్ భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికల ప్రచారం సాగుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సమావేశం కావడం  ప్రాధాన్యతను సంతరించుకొంది.

మంగళవారం నాడు ఉదయం తెలంగాణ సచివాలయంలో అసెంబ్లీ సెక్రటరీ  నరసింహాచార్యులు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య  సలహాదారుడు  రాజీవ్ శర్మ, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు,  సీఎస్ ఎస్ కే జోషీ సమావేశమయ్యారు.

ఈ సమావేశం తర్వాత  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  రజత్ కుమార్   రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషీతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ రద్దు విషయంలో  కేబినెట్ సభ్యులు నిర్ణయాధికారాన్ని  కేసీఆర్ కు కట్టబెట్టారు.  ఈ తరుణంలో ఈ వరుస సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకొంటున్నాయి.

మంగళవారం నాడు మధ్యాహ్నం  సీఎం కేసీఆర్  గజ్వేల్‌లో ఫాం హౌజ్ కు వెళ్లారు. అయితే ఫాం హౌజ్ కు రావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషీ, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహదారు రాజీవ్ శర్మను, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావును, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులను ఫాం హౌజ్ కు రావాలని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. అయితే ఫాం హౌజ్ లో కేసీఆర్ పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు, కొందరు మంత్రులతో చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. 

ఇదిలా ఉంటే రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషీ, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు కలిశారు. దీంతో ముందస్తు ఊహగానాలు మరింత ఊపందుకొన్నాయి.అయితే ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. 

ఈ వార్తలు చదవండి

కీలక సమావేశం: సీఎస్‌తో అసెంబ్లీ సెక్రటరీ సమావేశం, ఏం జరుగుతోంది?

ముందస్తు సంకేతాలు: హుస్నాబాద్‌ నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారం

PREV
click me!

Recommended Stories

Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు | Asianet News Telugu
Venkaiah Naidu Attends Sankranti: ఈ చిన్నారి రికార్డ్ చూసి వెంకయ్య నాయుడు షాక్| Asianet News Telugu