SSC result 2025 Telangana: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల... ఇలా చెక్ చేసుకొండి

Published : Apr 30, 2025, 03:04 PM IST
SSC result 2025 Telangana: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల... ఇలా చెక్ చేసుకొండి

సారాంశం

ssc result 2025 Telangana: ఇంతకాలం పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులకు కేవలం గ్రేడింగ్ మాత్రమే ఇచ్చేవారు... కానీ ఇకపై మార్కులను కూడా మెమోలో పొందుపర్చపనున్నారు. దీంతో గతంలో మాదిరిగా విద్యార్థులకు ఏ సబ్జెక్ట్ లో ఎన్నిమార్కులు వచ్చాయో తెలియనుంది.

ssc result 2025 Telangana: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు విడుదలయ్యాయి. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఈ ఫలితాల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్ సైట్స్ https://bse.telangana.gov.in/ లేదా results.bse.telangana.gov.in ను సంప్రదించవచ్చు. ఇక్కడ హాల్ టికెట్, డేట్ ఆఫ్ భర్త్ ఆధారంగా విద్యార్థుల ఫలితాలను పొందవచ్చు. ఇక్కడే కాదు చాలా వైబ్ సైట్స్ పదో తరగతి ఫలితాలను అందిస్తాయి. 

ఇక ఫోన్ లోనే కేవలం ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం TS10 ROLL NUMBER అని టైప్ చేసి 56263కు మెసేజ్ పంపిస్తే వెంటనే ఫలితాలు ఎస్ఎంఎస్ ద్వారా రానున్నాయి. 

ఈసారి పదో తరగతి ఫలితాల్లో మార్పులు :  

ఇంతకాలం పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులకు కేవలం గ్రేడింగ్ మాత్రమే ఇచ్చేవారు... కానీ ఇకపై మార్కులను కూడా మెమోలో పొందుపర్చపనున్నారు. దీంతో గతంలో మాదిరిగా విద్యార్థులకు ఏ సబ్జెక్ట్ లో ఎన్నిమార్కులు వచ్చాయో తెలియనుంది.  

రాత పరీక్షలో మార్కులతో పాటు బోధనేతర కార్యక్రమాల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చేవారు. దీనివల్ల విద్యార్థులకు ఓ కన్ఫ్యూజన్ ఉండేది... ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు వచ్చాయో తెలిసేది కాదు.  ఇది గమనించిన విద్యాశాఖ గతంలో మాదిరిగా మార్కులతో పాటు ఇప్పుడున్న గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించింది. దీంతో విద్యార్థుల మెమోలొ మార్కులతో పాటు గ్రేడ్స్ కూడా ఉండనున్నాయి. 

తెలంగాణలో గత నెల మార్చి 21 నుండి ఈనెల ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో కలిపి మొత్తం 5 లక్షలమందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాసారు. ఇలా ఓవైపు పరీక్షలు జరుగుతుండగానే మరోవైపు జవాబు పత్రాల మూల్యాంకన కూడా చేపట్టారు. దీంతో పరీక్షలు ముగిసిన నెల రోజుల్లోపే ఫలితాలను వెల్లడించగలుగుతున్నారు. 

అయితే గతంలో మాదిరిగా కాకుండా ఫలితాల విడుదలలో మార్పులు చేపట్టారు... గ్రేడ్స్ తో పాటు మార్కులను కూడా మెమోలొ పొందుపర్చాలని నిర్ణయించారు. దీంతో ఫలితాలు విడుదలకు ఆలస్యం అయ్యిందని... లేదంటే ముందుగానే ఫలితాలను వెల్లడించేవారిమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.  

మొత్తం ఉత్తీర్ణ‌త శాతం ఎంతంటే.

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో మొత్తం 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో 98.79 శాతం, బీసీ వెల్ఫేర్ పాఠశాలో 97.79 % , సోషల్ వెల్ఫేర్  97.1 శాతం, ట్రైబల్ వెల్ఫేర్  97.63 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌డం విశేషం. ఇక మైనార్టీ రెసిడెన్షియల్ 96.57 శాతం, మోడల్ స్కూల్స్ 95.31 శాతం, ఆశ్రమ పాఠశాలలో 95 శాతం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యార్థులకు 94.42 శాతం పాస్ అయ్యారు. ప్రైవేట్ పాఠ‌శాల‌లో 94.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

CISCE ICSE ఫలితాలు కూడా

కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్  ఫలితాలు కూడా బుధవారం విడుదలయ్యాయి. CISCE ICSE (10 తరగతి) , ISC (12 తరగతి) పరీక్షా ఫలితాలను ప్రకటించారు. స్కోర్‌కార్డులు అధికారిక వెబ్‌సైట్‌లు cisce.org , results.cisce.org ద్వారా అందుబాటులో ఉంటాయి. . ఫలితాలను తనిఖీ చేయడానికి, విద్యార్థులు తమ యూనిక్ ఐడీ, ఇండెక్స్ నంబర్, మరియు క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.

అదనంగా, విద్యార్థులు SMS ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. ఉదాహరణకు, 'ICSE [యూనిక్ ఐడీ]' అని టైప్ చేసి 09248082883 నంబర్‌కు పంపించాలి. ఫలితాలు డిజిటల్ కాపీలుగా డిజిలాకర్ (DigiLocker) ద్వారా కూడా అందుబాటులో ఉంటాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!