కారణమిదీ: బీజేపీ తెలంగాణ కార్యాలయం వద్ద శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం

Published : Nov 01, 2020, 01:16 PM IST
కారణమిదీ:  బీజేపీ తెలంగాణ  కార్యాలయం వద్ద శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం

సారాంశం

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ శ్రీనివాస్ అనే యువకుడు ఆదివారం నాడు బీజేపీ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  


హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ శ్రీనివాస్ అనే యువకుడు ఆదివారం నాడు బీజేపీ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

సిద్దిపేటకు వెళ్తున్న సమయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శ్రీనివాస్ ఇవాళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. 

పెట్రోల్ పోసుకొని శ్రీనివాస్ నిప్పంటించుకొన్నాడు. 40 శాతం శ్రీనివాస్ కాలిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు. చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించారు.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడెంగా గుర్తించారు.  బండి సంజయ్ అంటే నా ప్రాణం అంటున్నాడు. అంతేకాదు తన గుండె కోసి ఇస్తానని ఆయన చెప్పాడు. పార్టీ కోసం ప్రాణాలు కూడ ఇస్తానని చెప్పాడు.

బండి సంజయ్ అరెస్ట్ చేసిన రోజున తన ఆరోగ్యం బాగా లేనందున తాను ఆ రోజు రాలేకపోయినట్టుగా ఆయన చెప్పారు. ఇవాళ హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత ఆయన పార్టీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్