బాలాపూర్ లడ్డు రికార్డు ధర : రూ. 16.60లక్షలకు దక్కించుకొన్న శ్రీనివాస్ గుప్తా

Published : Sep 23, 2018, 10:47 AM ISTUpdated : Sep 23, 2018, 11:10 AM IST
బాలాపూర్ లడ్డు రికార్డు ధర : రూ. 16.60లక్షలకు దక్కించుకొన్న  శ్రీనివాస్ గుప్తా

సారాంశం

బాలాపూర్ లడ్డూను  బాలపూర్  ఆర్యవైశ్య సంఘం నేత శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు దక్కించుకొన్నాడు


హైదరాబాద్: బాలాపూర్ లడ్డూను  బాలపూర్  ఆర్యవైశ్య సంఘం నేత శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు దక్కించుకొన్నాడు. ఆదివారం నాడు జరిగిన లడ్డూ వేలంలో  శ్రీనివాస్ గుప్తా లడ్డును దక్కించుకొన్నాడు.

గత ఏడాది కంటే మరో లక్ష రూపాయాలు  అదనంగా వేలంలో శ్రీనివాస్ గుప్తా దక్కించుకొన్నారు. గత ఏడాది రూ.15.60లక్షలకు నాగం తిరుపతిరెడ్డి దక్కించుకొన్నారు.
ఈ ఏడాది బాలపూర్  ఆర్యవైశ్యసంఘం నేత శ్రీనివాస్ గుప్తా దక్కించుకొన్నాడు. 

ఈ ఏడాది శ్రీనివాస్ గుప్తాతో పాటు  పన్నాల కృష్ణ రెడ్డి,,కొలన్ రామ్ రెడ్డి,కుప్పి రెడ్డి విజయ భాస్కర్ రెడ్డి,పోరెడ్డి తిరుమల్ రెడ్డి ,ఎర్ర మహేశ్వరి,మన్నే బల్వంత్ రెడ్డి,భువనగిరి శ్రీనివాస్ బ్రదర్స్,లొక్క యాది రెడ్డి.,కళ్లెం ఎల్లా రెడ్డి వేలం పాటలో పాల్గొన్నారు. ఈ వేలం పాట 1994 నుండి కొనసాగుతోంది.

వేలం పాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని  గ్రామాభివృద్ధి కోసం కేటాయిస్తారు. వేలం పాట డబ్బులను వచ్చే ఏడాది వినాయకచవితి  వేలం పాట నాటికి లడ్డును గెల్చుకొన్నవాాళ్లు చెల్లించాల్సి ఉంటుంది.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu