ఐదేళ్లుగా లవ్: విడిపోదామన్న బావ....ప్రియురాలు ఇలా...

First Published 23, Sep 2018, 10:20 AM IST
Highlights

ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు విడిపోదామంటూ చేసిన  ప్రతిపాదనతో అనూష అనే విద్యార్థిని  ఆత్మహత్య చేసుకొంది

నిజామాబాద్: ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు విడిపోదామంటూ చేసిన  ప్రతిపాదనతో అనూష అనే విద్యార్థిని  ఆత్మహత్య చేసుకొంది. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న అనూష్  శనివారం నాడు ఆత్మహత్య చేసుకొంది.

సిద్దిపేట జిల్లా చిన్న కోడూర్‌ మండలం మందపల్లికి చెందిన అనూష వరుసకు బావ అయ్యే  నాగరాజును  ఐదేళ్లుగా ప్రేమిస్తోంది. అయితే ఇటీవల కాలంలో బావ నాగరాజు విడిపోదామంటూ అనూషకు చెప్పాడు.

బావ లేకుండా తాను ఉండలేనని  అనూష బావించింది.ఇదే విషయాన్ని కూడ  ఆయనకు చెప్పింది. బావ  విడిపోదామంటే అనూష తట్టుకోలేకపోయింది.శనివారం నాడు తోటి విద్యార్థినులు భోజనానికి వెళ్తే  అనూష  తాను చదువుకొనే ట్రిపుల్ ఐటీ కాలేజీ భవనం ఎక్కి కిందకు దూకింది.

కాలేజీ యాజమాన్యం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.   తన బావ వరుసైన నాగరాజును ప్రేమించినట్టు సూసైడ్ లేఖలో రాసింది. బావ లేకుండా తాను బతకలేనని ఆమె ఆ లేఖలో పేర్కొంది.

బావ లేని జీవితం ఊహించుకోవడం వ్యర్థమని భావించి ఆత్మహత్య చేసుకొంటున్నట్టు  ఆమె  ఆ లేఖలో స్పష్టం చేసింది.   బావ చాలా మంచోడని, తానే తప్పు చేశానని చెప్పింది. నాగరాజును ఏమీ అనవద్దని కోరింది. 

 

Last Updated 23, Sep 2018, 10:20 AM IST