ఎస్‌ఆర్ యూనివర్సిటీ మొట్టమొదటి విసిగా జీఆర్‌సి రెడ్డి

By Arun Kumar PFirst Published Jun 26, 2020, 11:48 AM IST
Highlights

ప్రముఖ విద్యావేత్త, పరిశోధకులు జీఆర్సి రెడ్డి ఎస్‌ఆర్ యూనివర్సిటీ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు.

వరంగల్: ప్రముఖ విద్యావేత్త, పరిశోధకులు జీఆర్సి రెడ్డి ఎస్‌ఆర్ యూనివర్సిటీ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి ఎస్ఆర్ యూనివర్సిటీ అధికారిక ప్రకటన చేసింది. 

ఎస్ఆర్ యూనివర్సిటీకి విసిగా నియమితులయ్యేకంటే ముందు జీఆర్సి రెడ్డి దేశంలోని అనేక అత్యున్నత విద్యాసంస్థల్లో పనిచేశారు. ఎన్ఐటీ కాలికట్ మరియు గోవా లకు డైరెక్టర్ గా  పనిచేయడమే కాదు వరంగల్ ఎన్ఐటీకి  ఇంచార్జీ డైరెక్టర్ గా 2005-17 సేవలు అందించారు.మెంటర్ డెరెక్టర్ ఆఫ్ ఎన్ఐటీ సిక్కిం, ట్రిపుల్ ఐటీ కొట్టాయం, ఎన్ఐటీ ఆంధ్ర ప్రదేశ్ గా పనిచేయడమే కాకుండా శారద యూనివర్సిటీకి విసిగా సేవలందించారు. 

ఎస్ఆర్ యూనివర్సిటీకి విసిగా నియమితులవడంపై జీఆర్సి రెడ్డి మాట్లాడుతూ... ఈ పదవిని పొందడం చాలా గౌరవంగా బావిస్తున్నానని అన్నారు. ఈ యూనివర్సీటికి మొట్టమొదటి విసి తానే  కావటం మరింత ఆనందాన్నిస్తోందని అన్నారు. 

ఎస్ఆర్ యూనివర్సిటీ ఇండియాలోని అత్యుత్తమ 160 విద్యాసంస్ధల్లో చోటు దక్కించుకోవమే కాకుండా తెలంగాణ టాప్ 5లో నిలిచిందని గుర్తుచేశారు. తెలంగాణలో టైర్ 2, టైర్ 3 ప్రాంతాల్లోని విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడం కోసం ఎస్ఆర్‌యూ అద్భుతంగా పనిచేస్తోందని... ఇకపైనా ఇలాగే పనిచేస్తుందని నూతన విసి వెల్లడించారు. 

click me!