కేసులకు భయపడ : స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అడ్మిన్ ప్రశాంత్ (వీడియో)

First Published Apr 3, 2018, 6:32 PM IST
Highlights
మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు

తెలంగాణలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా పనిచేస్తున్న ప్రశాంత్ ను గత రెండు రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. ఫేస్ బుక్ లోని స్పిరిట్ ఆఫ్ తెలంగాణ గ్రూప్ అడ్మిన్ గా ఉన్న ప్రశాంత్ పై కొందరు ఫిర్యాదు చేశారు.

సిఎం కేసిఆర్ ను ఉద్దేశించి ప్రశాంత్ బానిసలు అని స్పిరిట్ ఆఫ్ తెలంగాణ గ్రూప్ లో పోస్టులు చేసినట్లు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశాంత్ ను అదుపులోకి తీసుకుని గంటల కొద్దీ విచారించారు. సోమవారం విచారణ జరిపి రాత్రి 11 గంటలకు వదిలేశారు. తర్వాత మంగళవారం కూడా విచారణ చేపట్టారు పోలీసులు.

అయితే తనపై కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ప్రశాంత్ తేల్చి చెప్పారు. తన పోస్టుల్లో తప్పులుంటే చర్యలు తీసుకోవచ్చన్నారు. అయితే అన్ని ఎవిడెన్స్ తోనే తాను పోస్టులు పెట్టానని, తనపై ఏరకమైన కేసులు నమోదు చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెండోరోజు విచారణకు వెళ్తున్న సందర్భంలో ప్రశాంత్ మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ ఏమన్నారో పైన వీడియోలో చూడండి.

click me!