ఎంతటి ఘోరం.. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ...

Published : Oct 12, 2019, 03:45 PM ISTUpdated : Oct 12, 2019, 04:37 PM IST
ఎంతటి ఘోరం.. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ...

సారాంశం

ఎంతటి ఘోరం.. సమాజంలో నేరాలను అరికట్టాల్సిన పోలీసే హత్యకు పాల్పడ్డాడు. భార్యపై అనుమానం పెట్టుకుని అతి కిరాతంగా ఆమెను అంతమొందించాడు. అతి కిరతంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన  అంబర్ పేట ప్రాంతంలో చోటుచేసుకుంది. 

ఎంతటి ఘోరం.. సమాజంలో నేరాలను అరికట్టాల్సిన పోలీసే హత్యకు పాల్పడ్డాడు. భార్యపై అనుమానం పెట్టుకుని అతి కిరాతంగా ఆమెను అంతమొందించాడు. అతి కిరతంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన  అంబర్ పేట ప్రాంతంలో చోటుచేసుకుంది.

కర్నూల్ జిల్లాకు చెందిన అబ్దుల్‌ రషీద్‌ ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడుఅతనికి  2013లో నౌసిద్  బేగంతో వివాహం జరిగింది.  వీరికి ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు.రషీద్‌ భార్య పిల్లలతో  కలిసి ఏడాది కాలంగా  అంబర్‌పేటలోని ఆజాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న రషీద్ ఆమెతో తరుచూ గొడవ పడేవాడు.

శుక్రవారం కూడా  నౌషిద్‌ బేగంతో  గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇంటి యాజమాని సలీం కలగజేసుకుని గొడవ వద్దని వారికి సర్ధి చేప్పారు. తర్వాత ఇంట్లోకి వెళ్ళిన భార్యాభర్తలు తిరిగి గొడువ పడ్డారు. దీంతో ఆగ్రహంతో ఉగిపోయిన అబ్దుల్‌ రషీద్‌  భార్యను గొడ్డలితో నరికి చంపాడు. 3.30 గంటల సమయంలో నౌషిద్‌ రక్తం మడుగులో పడి ఉండడం గమనించిన ఇంటి యాజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్నిపోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరిలించారు.  గొడ్డలితో తలపై వేటు వేయడం వల్లే ఆమె మరణించినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న కానిస్టేబుల్‌ రషీద్‌ కోసం గాలిస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ