మాదాపూర్ లో ఫెరారీ కారు బీభత్సం.. వ్యక్తి మృతి

Published : Oct 12, 2020, 09:42 AM IST
మాదాపూర్ లో ఫెరారీ కారు బీభత్సం.. వ్యక్తి మృతి

సారాంశం

 ఆ మరణించిన వ్యక్తి పేరు యేసు బాబు గా పోలీసులు గుర్తించారు. అతను మాదాపూర్ లోని  ఓ నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్ మెన్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు.

మాదాపూర్ లో ఫెరారీ కారు భీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ వైపు వేగంగా వేళ్లుతున్న ఫేర్రారి కార్ రోడ్డు దాటుతున్న ఇద్దరిని ఢీ కొట్టింది.  కాగా.. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.కాగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా.. చనిపోయిన వ్యక్తి  వయసు 50 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

 ఆ మరణించిన వ్యక్తి పేరు యేసు బాబు గా పోలీసులు గుర్తించారు. అతను మాదాపూర్ లోని  ఓ నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్ మెన్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. కాగా.. యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కారు డ్రైవర్ నవీన్ కుమార్  అని.. అతనిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరగింది. ప్రమాదంలో చనిపోయిన  యేసు బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Viral news: కాళ్లు మొక్కుతా పాస్ చేయండి సర్.. ఇంటర్ ఆన్సర్ షీట్లో విద్యార్థి ఫన్నీ రాతలు, బొమ్మలు
Hyderabad: ఎంత‌కు తెగించ్చార్రా.? ఇది తెలిస్తే ఇక‌పై బ‌య‌ట ఫుడ్ చ‌చ్చినా తిన‌రు