తెలంగాణలో కాంగ్రెస్ కు భారీషాక్ :సీఎల్పీ నేతగా భట్టి పేరు తొలగింపు

By Nagaraju penumalaFirst Published Jun 26, 2019, 8:24 AM IST
Highlights

అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిందంటూ స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మల్లుభట్టి విక్రమార్క పేరును తొలగిస్తూ ఉత్తర్వుల్లోపేర్కొంది. దీంతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయినట్లు అధికారికంగా స్పష్టం చేసింది. 

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులు, వలసలతో గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిందంటూ స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. 

అంతేకాదు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మల్లుభట్టి విక్రమార్క పేరును తొలగిస్తూ ఉత్తర్వుల్లోపేర్కొంది. దీంతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయినట్లు అధికారికంగా స్పష్టం చేసింది. 

ఇకపోతే ఇటీవలే తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షాన్ని విలీనం చేస్తూ ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు నోటీసులు జారీ చేశారు. అసెంబ్లీలో 2/3వంతు మెజారిటీ సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసిన నేపథ్యంలో అందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 
అధికారికంగా బుధవారం ఉదయం ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడంపై కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. 

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలు హైకోర్టును ఆశ్రయించగా కోర్టులో విచారణ జరుగుతోంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత పేరు తొలగిస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

click me!