సిరిసిల్లలో యువకులపై దాడి చేసిన పోలీసులపై ఎస్పీ రాహుల్ హెగ్డే సీరియస్ అయ్యారు.
సిరిసిల్ల: న్యూ ఈయర్ వేడుకల సందర్భంగా యువకులను చితకబాదిన పోలీసులపై ఎస్పీ రాహుల్ హెగ్డే చర్యలు తీసుకొన్నారు. నలుగురు పోలీసులపై వేటు వేస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకొన్నారు.
న్యూ ఈయర్ వేడుకల్లో భాగంగా మద్యం తాగి బీరు సీసాలను రోడ్డుపైనే పగులగొట్టిన యువకులపై సిరిసిల్ల పోలీసులు విచక్షణ రహితంగా కొట్టిన విషయం తెలిసిందే.మద్యం తాగి రోడ్డుపై బీరు సీసాలను పగులగొట్టకూడదని పోలీసులు మద్యం మత్తులో ఉన్న యువకులకు సర్ధిచెప్పారు. అయితే మద్యం మత్తులో ఉన్న యువకులు పోలీసులపై తిరగబడ్డారు.
also read:సిరిసిల్లలో రాడ్లు కత్తులు పట్టుకొని చెలరేగిన పోకిరీలు.. తాట తీసిన పోలీసులు.
నలుగురు యువకులు పోలీసులపై తిరగబడే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకులను చితకబాదారు. యువకులను పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో ఆ యువకులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.
యువకులను పోలీసులు కొట్టే సమయంలో కొందరు ఆ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ వీడియోలపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సీరియస్ అయ్యారు.
యువకులపై దాడి చేసిన నలుగురు పోలీసులపై చర్యలు తీసుకొన్నారు. ఇద్దరు ఎస్ఐలు, ఓ కానిస్టేబుల్, ఒ హోంగార్డులను హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.