ఆ రూట్‌లో వెళ్లే రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 24 రోజుల పాటు 4 రైళ్లు క్యాన్సల్, మరికొన్ని పాక్షికంగా రద్దు..

By Sumanth KanukulaFirst Published Jun 26, 2022, 11:31 AM IST
Highlights

కాజిపేట - బల్లార్ష సెక్షన్‌లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల వల్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టుగా, కొన్నింటిని దారి మళ్లించనున్నట్టుగా పేర్కొంది. 

కాజిపేట - బల్లార్ష సెక్షన్‌లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల వల్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టుగా, కొన్నింటిని దారి మళ్లించనున్నట్టుగా పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే శనివారం వెల్లడించింది. ఇందులో 4 రైళ్లను 24 రోజుల పాటు రద్దు చేస్తున్నట్టుగా తెలిపింది. ఆ జాబితాలో 12757- సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ (డైలీ), 12758- సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ (డైలీ), 17003- కాజిపేట్ - సిర్పూర్ టౌన్ (డైలీ), 17004- బల్లార్ష - కాజిపేట్ (డైలీ) ఉన్నాయి. వీటిని ఈ నెల 27 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు నిలిపివేయనున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. 

ఇక, 17011- హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ (డైలీ), 17012- సిర్పూర్ కాగజ్ నగర్- హైదరాబాద్ (డైలీ) రైళ్లను జూలై 10, 13, 20 తేదీల్లో రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దీంతో హైదరాబాద్ నుంచి కాజిపేట్ మీదుగా బల్లార్ష మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. 

పాక్షికంగా రద్దైన రైళ్ల వివరాలు.. 
- (17033) భద్రాచలం రోడ్డు - బలార్ష రైలును వరంగల్ వరకే పరిమితం చేయనున్నారు. దీనిని వరంగల్- బల్లార్ష మధ్య రద్దు చేశారు. ఈ నెల 27 నుంచి జూలై 20 వరకు ఇదే స్థితి కొనసాగనున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 
- (17034) సిర్పూర్ టౌన్- భద్రాచలం రోడ్డు రైలు వరంగల్ నుంచి ప్రారంభం కానుంది. దీనిని సిర్పూర్ టౌన్ - వరంగల్ మధ్య రద్దు చేశారు. ఈ నెల 27 నుంచి జూలై 20 వరకు ఇదే స్థితి కొనసాగనున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 
- (17233)- సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్ రైలును కాజిపేట వరకే పరిమితం చేయనున్నారు. దీనిని కాజిపేట- సిర్పూర్ కాగజ్‌నగ్ మధ్య రద్దు చేశారు. ఈ నెల 27 నుంచి జూలై 19 వరకు ఇదే స్థితి కొనసాగనున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 
-(17234)- సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్ రైలు కాజిపేట నుంచి ప్రారంభం కానుంది. దీనిని సిర్పూర్ కాగజ్‌నగర్- కాజిపేట మధ్య రద్దు చేశారు. ఈ నెల 27 నుంచి జూలై 20 వరకు ఇదే స్థితి కొనసాగనున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 

దారి మళ్లించిన రైళ్ల వివరాలు.. 
కాజిపేట - బల్లార్ష సెక్షన్‌లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల వల్ల 12 రైళ్లను దారి మళ్లించినట్టుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందుకు సంబంధించిన జాబితాను ఇక్కడ చూడవచ్చు.. 

రైళ్ల రీషెడ్యూల్.. 
- (12724) న్యూఢిల్లీ - హైదరాబాద్ రైలును జూలై 9, 12, 19 తేదీల్లో సాయంత్రం 4.00 గంటలకు బదులుగా 5.30 బయలుదేరనుంది. 
-(07197) కాజిపేట- దాదర్ సెంట్రల్ రైలు జూలై 2వ తేదీన ఉదయం 11.30 గంటలకు బదులుగా మధ్యాహ్నం 2.30కు బయలుదేరనుంది. 

click me!