కొల్లాపూర్‌లో టెన్షన్: జూపల్లికి ఇంటికి బయలుదేరిన బీరం, పోలీసుల అదుపులో ఎమ్మెల్యే

By narsimha lode  |  First Published Jun 26, 2022, 10:56 AM IST

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని ఆదివారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేయడాన్ని బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. 


 నాగర్‌‌కర్నూల్:  Kollapur  నియోజకవర్గ అభివృద్దిపై చర్చించేందుకు మాజీ మంత్రి Jupally Krishna Rao  ఇంటికి బయలు దేరిన కొల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే Beeram Harshavardhan Reddyని ఆదివారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు తన ఇంటికి ఎమ్మెల్యే వస్తే సాదరంగా ఆహ్వానించేందుకు సిద్దంగా ఉన్నానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా తన ఇంటి గేటు వద్ద వేచి ఉన్నాడు.

  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి బయలుదేరిన బీరం హర్షవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బారికేడ్లు తోసుకొని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి వైపునకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి police  తొలుత నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్తానని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. దీంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు ఆయ న అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Latest Videos

undefined

ఎమ్మల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని పోలీసులు తమ వాహనంలో పెద్దె కొత్తేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసుల వాహనాన్ని హర్షవర్ధన్ రెడ్డి  వర్గీయులు అడ్డుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే వెంటే తాము వస్తామని ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే వాహనం వెంట కొద్దిదూరం అనుచరులను అనుమతించిన పోలీసులు ఆ తర్వాత వారిని మరో మార్గంలోకి తీసుకెళ్లి అదుపులోకి తీసుకెళ్లారు. మరో వైపు ఎమ్మెల్యేను నాగర్ కర్నూల్ వైపునుకు తీసుకెళ్లారు పోలీసులు. 

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లకుండా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులను పోలీసులు అడ్డుకున్నారు. కొల్లాపూర్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 అరెస్టై ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  బహిరంగ చర్చకు రాకుండా తప్పించుకున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.  కానీ తాను మాత్రం తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని జూపల్లి కృష్ణారావు  ఆరోపించారు.

కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎవరి హయంలో అభివృద్ది జరిగిందో చర్చకు అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్దమా అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ చేశారు. ఈ విషయమై ఈ నెల 26న అంబేద్కర్ చౌరస్తాలో చర్చ నిర్వహిస్తానని జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.ఈ సవాల్ కు స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఈ నెల 21న స్పందించారు. అంబేద్కర్ చౌరస్తాలో కాదు ఈ విషయమై జూపల్లి కృష్ణారావు ఇంటికే వచ్చి చర్చించేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన ప్రకటించారు.

also read:కొల్లాపూర్‌లో ఉద్రిక్తత: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్

ఈ బహిరంగ చర్చలో పాల్గొనేందుకు  ఇద్దరు నేతలు సిద్దమయ్యారు.ఇదే సమయంలో ఇద్దరు నేతలకు చెందిన అనుచరులు కూడా వారి ఇళ్ల వద్ద భారీగా చేరుకున్నారు. ఇరువురు నేతల ఇళ్ల వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్దకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లకుండా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మరో వైపు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లకుండా ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

click me!