త్వరలోనే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర - బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్

Published : May 18, 2022, 01:46 PM IST
త్వరలోనే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర - బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్

సారాంశం

త్వరలోనే మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గత రెండు విడతల పాదయాత్రలు విజయవంతం అయ్యాయని చెప్పారు. ఆయన బుధవారం వేములవాడలో మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డ‌కుంలు సృష్టించినా ప్ర‌జా సంగ్రామ యాత్ర స‌భ విజ‌యవంతం అయ్యింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కుమార్ అన్నారు. ఈ పాద‌యాత్ర తెలంగాణ సమాజానికి ఒక భరోసా వచ్చింద‌ని అన్నారు. అట్టడుగు ప్రజలకు అండగా బీజేపీ ఎప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని అన్నారు. త్వరలోనే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతామని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఏడేళ్లలో తెలంగాణను అప్పుల్లో ఊబిలోకి నెట్టిన కేసీఆర్:రేవంత్ రెడ్డి

వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ లో బీజేపీ బూత్ కమిటీ సమావేశానికి బండి సంజ‌య్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న వెంట ఆ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర నాయ‌కుడు కటకం మృత్యుంజయం ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పోలింగ్ బూత్ కమిటీలతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌మావేశం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామ‌ని అన్నారు. తెలంగాణ లో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుంద‌ని చెప్పారు. సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ సైకో లాగా మారాడ‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఇష్టమొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని తెలిపారు. 

 నేరుగా పల్లెలకు కేంద్రమే నిధులు పంపడం చిల్లర వ్యవహారం: కేంద్రంపై మరోసారి కేసీఆర్ ఫైర్


సీఎం కేసీఆర్ కు, అలాగే ప్ర‌భుత్వానికి సన్ స్ట్రోక్ గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. మోడీ ప్ర‌ధాని అని విష‌యం మ‌ర్చిపోయి మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేశార‌ని అన్నారు. అన్ని సర్వే సంస్థలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ప‌ని అయిపోయింద‌ని చెబుతున్నాయ‌ని, అన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయ‌ని తెలిపారు. శ్రీలంక లో కుటుంబ పాలన ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వ‌ర్గంలో అతి ముఖ్య‌మైన శాఖ‌లు కేసీఆర్ కుటుంబానికే ఉన్నాయ‌ని ఆరోపించారు. తెలంగాణలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సాల‌రీలు, పెన్షన్ లు ఇవ్వ‌లేని ప‌రిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చార‌ని అన్నారు. కానీ శ్రీలంక పరిస్థితి రాకూడ‌ద‌ని అన్నారు. 

తెలంగాణ‌కు వేల కోట్ల రూపాయిలు ఇవ్వ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని బండి సంజ‌య్ అన్నారు. కానీ కేసీఆర్ ప్ర‌భుత్వం అభివృద్ధికి స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయ‌కులు కేంద్ర ప్ర‌భుత్వాన్ని బ‌ద్నామ్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని తెలిపారు. డబుల్ ఇంజన్ ప్ర‌భుత్వం వ‌స్తేనే ప్ర‌జ‌ల క‌ష్టాలు తీరుతాయ‌ని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధ‌ర‌లు పెంచి ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యాట్ టాక్స్ తగ్గించినా.. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌గ్గించ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని, ప్ర‌తీ సంవత్స‌రం జాబ్ క్యాలెండర్ విడుద‌ల చేస్తామ‌ని బండి సంజ‌య్ హామీ ఇచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్