అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ:రేవంత్ రెడ్డి

By narsimha lode  |  First Published May 18, 2022, 1:18 PM IST

వరంగల్ డిక్లరేషన్ ను గ్రామాల్లో విస్తృతంగా  ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా  రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.


హైదరాబాద్: ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 65 ఏళ్లలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలన్నీ రూ. 16 వేల కోట్లు అప్పులు చేస్తే ఏడేళ్లలో రూ. 5 లక్షల కోట్లు అప్పులు చేసిందని రేవంత్ రెడ్డి  చెప్పారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని KCR దివాళా తీయించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

బుధవారం నాడు హైద్రాబాద్ లో టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 8 వేల మంది రైతులు చనిపోయారన్నారు.తెలంగాణ కోసం 1500 మంది  ఆత్మార్పణం చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ రాష్ట్రంగా మార్చారన్నారు. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకు వచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు.

Latest Videos

undefined

రైతు ఆత్మగౌరవంతో బతికేందుకు వీలుగా తాము వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటించినట్టుగా  టీపీసీసీ చీఫ్ Revanth Reddy చెప్పారు. Congress  హయంలో తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిన విసయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.81 ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్మించిందన్నారు.ఏదైనా వస్తువును  ఉత్పత్తి చేసిన వారే ఆ వస్తువు ధరను నిర్ణయిస్తున్నారన్నారు. కానీ  పండించిన రైతు మాత్రం తమ పంటకు  ధరను నిర్ణయించుకొనే పరిస్థితి లేదన్నారు. 

also read:ఈ నెల 21 నుండి రైతు రచ్చబండ: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

రైతు ఆత్మగౌరవంతో బతికేందుకు వీలుగా తాము వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటించామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.  వరంగల్ డిక్లరేషన్ ను  గ్రామ గ్రామాల్లోకి  తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతోనే రైతు రచ్చబండ కార్యక్రమాన్ని తీసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు.Rythu Rachabanda కార్యక్రమాన్ని నెల రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ. 2 లక్షల రుణ మాఫీ 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి 30 రోజుల్లో రైతులకు రూ. 2 లక్షల రుణమాపీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతులకు రుణమాఫీని విడతల వారీగా వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించనుందన్నారు. రాష్ట్రంలో వృదా ఖర్చును పూర్తిగా నిలువరిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతు డిక్లరేషన్ ను ప్రకటించామన్నారు. రానున్న రోజుల్లో వైద్య, విద్యపై కూడా డిక్లరేషన్లను కూడా ప్రకటించనున్నట్టుగా రేవంత్ రెడ్డి వివరించారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పంటల విషయంలో రైతులకు గందరగోళం ఉండదన్నారు. 

click me!