తండ్రిని గొంతుకోసి చంపిన కొడుకు.. పెళ్లి చేయడం లేదని పైశాచికత్వం..

Published : Jun 14, 2022, 01:02 PM IST
తండ్రిని గొంతుకోసి చంపిన కొడుకు.. పెళ్లి చేయడం లేదని పైశాచికత్వం..

సారాంశం

ఓ కొడుకు తండ్రిమీదే దారుణానికి తెగబడ్డాడు. పెళ్లి చేయడం లేదన్న కారణంతో గొంతుకోసిమరీ హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అదిలాబాద్ లో చోటుచేసుకుంది. 

అదిలాబాద్ : తనకు పెళ్లి చేయడం లేదని తండ్రి గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు ఓ కొడుకు. జిల్లా కేంద్రంలోని పింజరిగుట్ట కాలనీలో సోమవారం ఈ ఘటన కలకలం రేపింది. డీఎస్పీ జీవన్ రెడ్డి కథనం ప్రకారం.. పింజరిగుట్ట కాలనీకి చెందిన అప్పాల గణపతి.. ప్రభుత్వ మార్కెట్ కమిటీ ఆఫీసులో ఉద్యోగం చేసి విరమణ పొందాడు. ఇతడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు.

చిన్న కొడుకు అన్వేష్ ఎలాంటి పని చేయకుండా ఇంట్లో ఉంటున్నాడు. తనకు పెళ్లి చేయమని తండ్రితో ప్రతి రోజూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం వారి మధ్య గొడవ జరిగింది. కోపొద్రిక్తుడైన అన్వేష్ తండ్రి గణపతి మెడమీద కొడవలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అల్లుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

హైదరాబాద్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం.. పోలీసు వాహనం పైకెక్కి రచ్చ..

ఇలాంటి ఘటనే ఈ మే నెల 19న పాకిస్తాన్ లో జరిగింది. పాకిస్థాన్లో కొడుతున్నాడు అన్న కారణంతో ఓ యువకుడు తన తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేసాడు అంతేకాకుండా కొన్ని శరీర భాగాలకు నిప్పంటించాడు.ఈ ఘటనలో పోలీసులకు మరి కొన్నివిస్తుపోయే విషయాలు తెలిశాయి. పాకిస్తాన్లోని కరాచీ సమీపంలో సూపర్ హైవేపై అఫ్గాన్ బస్తీ వద్ద పోలీసులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహానికి తల, కాళ్లు లేకుండా ఉండడం… శరీర భాగాలను  ముక్కలుగా నరికి బ్యాగ్ లో పడేసి ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు గురించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఒక్కొక్కటీ తెలుస్తుంటే షాక్ తో ఒళ్లు జలదరించిపోయి.. వణికిపోయారు. 

సదరు మృతుడిని కన్నకొడుకే తండ్రిని దారుణంగా  కొట్టి హత్య చేశాడని తెలుసుకున్నారు. ఆ తర్వాత మృతదేహం గుర్తు పట్టకుండా ముక్కలుగా నరికినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు. ముక్కలుగా నరికిన బాడీ పార్ట్స్ కు నిప్పు  అంటించినట్లు వెల్లడించాడు. తల, మొండెం లేని శరీరాన్ని గుర్తించడానికి ఫోరెన్సిక్ బృందం చాలా కష్టపడి అతని ఆచూకీ గుర్తించింది. ఈ శరీర భాగాలు పీఐబీ కాలనీకి చెందిన సలీం ఖిల్జీ గా గుర్తించారు. అతడి కొడుకు పై అనుమానం వచ్చి విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నట్లు చెప్పారు.

తండ్రి హత్య చేసిన తర్వాత..తలను లియారీ నదిలో, కాళ్లను జూబ్లీ మార్కెట్లో, ఇతర శరీర భాగాలను అఫ్గాన్ బస్తీ సమీపంలో వదిలి వెళ్ళినట్లు ఎస్ఎస్పీ అల్తాఫ్ హుసేన్ వివరించారు. తన సుదీర్ఘ కెరీర్లో ఇది అత్యంత భయంకరమైన సంఘటన అని,  కన్న తండ్రి కొడుతున్నాడు అనే కారణంతో అతడిని చంపడం అత్యంత దారుణమని ఎస్ఎస్పీ  ఆవేదన చెందారు.  తన తండ్రి మృతదేహాన్ని ఎవరు గుర్తించవద్దనే ఉద్దేశంతో ఏప్రిల్ 21న సుత్తితో కొట్టి హత్య చేసి.. ముక్కలు ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశాడని అతని చెప్పుకొచ్చాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu