భార్య పుట్టింటికి వెళ్లి, రావడంలేదని.. కన్నతండ్రిని చంపిన కొడుకు..

Published : Jun 18, 2021, 10:08 AM IST
భార్య పుట్టింటికి వెళ్లి, రావడంలేదని.. కన్నతండ్రిని చంపిన కొడుకు..

సారాంశం

ఖమ్మం రూరల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నతండ్రినే కుమారుడు హతమార్చిన సంఘటన ఖమ్మం రూరల్ మండలంలోని ఎం.వెంకటాయపాలెంలో బుధవారం కలకలం రేపింది.

ఖమ్మం రూరల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నతండ్రినే కుమారుడు హతమార్చిన సంఘటన ఖమ్మం రూరల్ మండలంలోని ఎం.వెంకటాయపాలెంలో బుధవారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామనికి చెందిన కొలిచెలం రామ చంద్రయ్య(70)కి ఇద్దరు కుమారులు క్రిష్ణ, ఉమాశంకర్ ఉన్నారు. 

ఉమాశంకర్ భార్యతో గొడవపడటంతో ఆమె నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య కాపురానికి రాకపోవడానికి తండ్రే కారణం అంటూ ఉమాశంకర్ నిత్యం గొడవపడుతుండేవాడు.

బుధవారం తెల్లవారుజామున కూడా ఇదే విషయమై తండ్రి రాంచంద్రయ్యతో తీవ్రంగా ఘర్షణ పడ్డాడు. అడ్డుకోబోయిన తల్లిని కూడా నెట్టేశాడు. కండువాను తండ్రి మెడకు బిగించి, గొంతు నులిమి, తలను నేలకేసి మోదాడు. అనంతరం పారిపోయాడు. 

పక్కింటివారు వచ్చి చూసే సరికి రాంచంద్రయ్య తీవ్ర రక్తస్రావమై మృతి చెంది ఉన్నాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని మరో కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐఎంఏ రవూఫ్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు