తెలుగు రాష్ట్రాల్లో విడిచిన సూర్యగ్రహణం.. సంప్రోక్షణ తర్వాత తెరచుకోనున్న ఆలయాలు

Siva Kodati |  
Published : Oct 25, 2022, 07:17 PM ISTUpdated : Oct 25, 2022, 07:18 PM IST
తెలుగు రాష్ట్రాల్లో విడిచిన సూర్యగ్రహణం.. సంప్రోక్షణ తర్వాత తెరచుకోనున్న ఆలయాలు

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం విడిచింది. ఆకాశంలో చోటు చేసుకున్న అద్భుతాన్ని వీక్షించి ప్రజలు పులకించిపోయారు. కొన్ని చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో జనం సూర్యగ్రహణాన్ని చూశారు. గ్రహణం విడిచిన తర్వాత మూసివుంచిన ఆలయాలను ఒక్కొక్కటిగా తెరిచారు.   

కాగా.. సూర్య గ్రహణం సందర్భంగా మంగళవారం (అక్టోబర్ 25) 12 గంటల పాటు తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు టిటీడీ తెలిపిన సంగతి తెలిసిందే. 25న ఉదయం 8.11 నిమిషాల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు శ్రీవారి ఆలయం తలుపులు మూసి ఉంచుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ సందర్భంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు.  దర్శనాలకు సంబంధించి సోమవారం ఎలాంటి సిఫార్సు లేఖలు తీసుకోరు. అలాగే లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ రద్దు చేయాలన్నారు. గ్రహణం పూర్తయ్యాక ఆలయ శుద్ధి చేసి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. గ్రహణం తర్వాత కూడా కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి సహకరించారని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.

శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం..
దీపావళి సందర్భంగా శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు,  తిరుమల జీయంగార్లు, టిటిడి అధికారుల సమక్షంలో ఈ ఆస్థాన వేడుకను నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి, ఉత్సవ మూర్తులకు నూతన పట్టు వస్త్రాలు అలంకరించారు. బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను ముస్తాబు చేసి ఈ ఆస్థానం నిర్వహించారు. 
 
PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే