బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు చూపి.. ఒక్కొక్కటిగా బయటపడుతోన్న ఎమ్మార్వో లీలలు

Siva Kodati |  
Published : Oct 25, 2022, 05:53 PM IST
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు చూపి.. ఒక్కొక్కటిగా బయటపడుతోన్న ఎమ్మార్వో లీలలు

సారాంశం

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మాజీ ఎమ్మార్వో రాజయ్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరోసారి రాజయ్య బాగోతం భయటపడింది. బతికి వున్న యువకుడిని చనిపోయినట్లు చూపించిన వైనం వెలుగులోకి వచ్చింది

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మాజీ ఎమ్మార్వో రాజయ్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కాసులకు కక్కుర్తి పడి భూములను వేరే వారికి పట్టా చేశారు రాజయ్య. గత నెల సెప్టెంబర్ 20న బతికున్న మహిళను చనిపోయినట్టు చిత్రీకరించారు రాజయ్య. అలా ఏకంగా 28 ఏకరాల భూమిని వేరే వారి పేరుపై పట్టా చేశారు రాజయ్య. ఇప్పుడు తాజాగా మరోసారి రాజయ్య బాగోతం భయటపడింది. బతికి వున్న యువకుడిని చనిపోయినట్లు చూపించిన వైనం వెలుగులోకి వచ్చింది. అతని భూమిని వేరే వారికి పట్టా చేశాడు రాజయ్య. అయితే రాబోయే రోజుల్లో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే