హైదరాబాదులో ఇన్నోసిస్ సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆత్మహత్య

By telugu teamFirst Published Jan 20, 2021, 7:40 AM IST
Highlights

హైదరాబాదులోని పటాన్ చేరులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్ లైన్ బెట్టింగుల కారణంగా అప్పుల పాలైన రవికుమార్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్: ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న ఓ సాప్ట్ వేర్ ఇంజనీరు హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్ లైన్ బెట్టింగులతో అప్పుల పాలైన అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పటాన్ చెరు ఎస్సై ప్రసాద రావు అంందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

పటాన్ చేరులోని చైతన్యనగర్ కాలనీకి చెందిన రవికుమార్ (28) బెంగళూరు ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాడు. కరోనా వ్యాప్తి, లాకౌడ్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం చెస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను ఆన్ లైన్ బెట్డింగులు కడుతూ అప్పుల పాలయ్యాడు. 

అప్పటికి తండ్రి ప్రభాకర్ లక్ష రూపాయల అప్పులు తీర్చాడు. మరిన్ని అప్పులు అలాగే ఉండిపోయాయి. తండ్రి ప్రభాకర్ ఉద్యోగానికి వెళ్లగానే పడక గదిలోకి వెళ్లి చీరెతో అతను ఉరేసుకున్నాడు. దాన్ని గమనించిన తల్లి పక్కింటివారికి విషయం చెప్పింది. వారు హుటాహుటిన వచ్చి రవికుమార్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. 

click me!