బావిలో పడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి..

By SumaBala BukkaFirst Published Mar 15, 2022, 9:37 AM IST
Highlights

జగిత్యాలలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. బావిలో పడి ముక్కు, తల వెనుక భాగం, చెవుల వద్ద రక్తం కారి మరణించడం అనుమానాలకు దారి తీసింది. 

మెట్పల్లి : Jagtial జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులోని వ్యవసాయబావిలో పడి అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి చెందాడు. ఎస్సై సుధాకర్ కథనం ప్రకారం మెట్పల్లి పట్టణానికి చెందిన బర్ల హరీశ్ (31) హైదరాబాద్ లో Software engineerగా పని చేస్తున్నాడు. ఏడాదిన్నర కిందట ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారం క్రితం మెట్పల్లికి వచ్చిన హరీష్  ఆదివారం సాయంత్రం తన స్నేహితులు ఫోన్ చేసి రమ్మన్నారని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. ఆదివారం రాత్రి హరీశ్ వెల్లుల్ల శివారులో ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడి పోయాడని ఆయన చిన్న కుమారుడికి స్నేహితులు సమాచారం ఇచ్చారు.  

సమీపంలోని వ్యవసాయ తోటల వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్రవాహనం దూసుకుపోయి హరీష్ బావిలో.. వెనుక కూర్చున్న యువకుడు గట్టు వైపు పడిపోయారని తెలిపారు. పోలీసులు,  స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లు సాయంతో బావిలో గాలించారు. సోమవారం తెల్లవారుజామున బావిలో నుంచి హరీష్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి ముక్కు, తల వెనుక భాగం, చెవుల వద్ద రక్తం కారుతుండడంతో కుటుంబసభ్యులు ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. సీఐ శ్రీను సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

12 ఏళ్ల క్రితం..
సుమారు 12 ఏళ్ల క్రితం హరీష్ కు సోదరుడు అయ్యే చిన్నాన్న కుమారుడు అభిషేక్ కూడా బావిలో పడి చనిపోయినట్లు కుటుంబసభ్యులకు తెలిపారు. హరీష్ కూడా అదే రీతిలో బావిలో విగత జీవిగా మారడం కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్రంగా కలచివేసింది. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో హరీష్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో మార్చ్ 3న Software engineer ను అపహరించి.. వికారాబాద్ అడవుల్లో murder చేసిన నిందితుడికి life imprisonment విధిస్తూ.. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఎస్ ఆర్ నగర్ లో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు… బి.కె గూడాలోని వెంకటేశ్వర ఆలయం సమీపంలో ఉండే చంద్రశేఖర్ గౌడ్ (35) నిరుడు డిసెంబర్ 4న కనిపించకపోవడంతో  రాములమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చంద్రశేఖర్ గౌడ్ మొదటిభార్య సోదరుడైన అరుణ్ కుమార్ గౌడ్ (35) ఇద్దరు కిరాయి హంతకులకు supari ఇవ్వడంతో... వారు అతడిని kidnap చేసి వికారాబాద్ అడవుల్లో హత్య చేశారు. హత్య చేసిన దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి.. ఫోటోలను అరుణ్ కుమార్ గౌడ్ కు పంపారు. నిందితుడు ఆ ఫోటోలను తన సోదరితో పాటు పాతబస్తీకి చెందిన ఇద్దరు సమీప బంధువులకు చేరవేశాడు. మెయిల్స్ ద్వారా పంపిన ఫోటోల వ్యవహారం బయటకు పొక్కి.. చివరకు పోలీసులకు చేరింది. 

దర్యాప్తు ప్రారంభించిన  అప్పటి ఇన్స్పెక్టర్  రమణ గౌడ్  నేతృత్వంలోని ఎస్సై సుదర్శన్రెడ్డి బృందం అరుణ్ కుమార్ గౌడ్ ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తగిన సాక్ష్యాధారాలతో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ కొనసాగి, హత్య చేసిన నిందితుడు అరుణ్ కుమార్ గౌడ్ కు జీవిత ఖైదుతో పాటు రూ. 5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఇ. తిరుమలదేవి బుధవారం తీర్పు ఇచ్చారు.

click me!