వరకట్న వేధింపులు.. కొడుకుతో సహా బిల్డింగ్ మీదినుంచి దూకిన తల్లి.. చిన్నారి మృతి, తల్లి పరిస్థితి విషమం..

Published : Mar 15, 2022, 07:39 AM IST
వరకట్న వేధింపులు.. కొడుకుతో సహా బిల్డింగ్ మీదినుంచి దూకిన తల్లి.. చిన్నారి మృతి, తల్లి పరిస్థితి విషమం..

సారాంశం

అదనపు కట్నం అతివల ప్రాణాలు తీస్తోంది.. వీరితో పాటూ చిన్నారులనూ బలి తీసుకుంటోంది. తాజాగా సికింద్రాబాద్ లో ఓ వివాహిత వేధింపులు తాళలేక యేడాది చిన్నారితో పాటు బిల్డింగ్ మీది నుంచి దూకింది. 

సికింద్రాబాద్ : extra dowry harassment భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ married women దారుణానికి తెగబడింది. తన కుమారుడితో పాటు నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకి suicideకు ప్రయత్నించింది. ఈ విషాద ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడాది వయసున్న బాబు అక్కడికక్కడే మృతి చెందగా,  తీవ్రగాయాలతో తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం..  మెట్టుగూడకు చెందిన తప్పెట మహేందర్, దివ్య తేజ (32) భార్య భర్తలు. 2018 సెప్టెంబర్ 6న మల్కాజ్గిరి సపిల్గూడకు చెందిన లక్ష్మణ్ దాస్, తరుణలత  కుమార్తె దివ్యతేజను మెట్టుగూడకు చెందిన మహేందర్ కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నంగా రూ. నాలుగు లక్షల నగదు,  10 తులాల బంగారు నగలు ఇచ్చారు.

తాను సీఏ చదివానని, ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నానని చెప్పిన మహేందర్ పెళ్లి తర్వాత ఉద్యోగానికి వెళ్లడం మానేసాడు. గతేడాది మార్చిలో ఈ దంపతులకు బాబు (రుత్విక్) జన్మించాడు. మెట్టుగూడలో వీరి నివాసం ఉంటున్నారు. ఉద్యోగానికి వెళ్లకపోగా, ఇల్లు గడవడానికి  అదనపు కట్నం తేవాలంటూ మహేందర్ తన భార్యను మానసికంగా శారీరకంగా హింసించేవాడు. మరో మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే దివ్య తేజ  ఈనెల 7న  తన నగలను తీసుకెళ్ళి పుట్టింట్లో ఉంచి ఈనెల 13న తిరిగి వచ్చింది.

వచ్చేసరికి వేరొకరితో భర్త గొడవ పడుతూ ఉండడం చూసి మానసికంగా కుంగి పోయింది. దీంతో సోమవారం ఉదయం ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల  భవనం పైకి తన కొడుకుని తీసుకుని వెళ్ళింది. అక్కడ తన కొడుకు మెడ కింద, రెండు చేతుల మణికట్టు వద్ద చాకుతో కోసింది.  తాను కూడా కోసుకుంది. ఆ చిన్నారికి శానిటైజర్ తాగించి,  తాను కూడా తాగింది. తరువాత పైనుంచి కొడుకు తో సహా కిందికి దూకింది. ఈ ఘటనలో చిన్నారి రుత్విక్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రగాయాల పాలైన ఆమెను స్థానికులు సికింద్రాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చిలకలగూడ ఠాణా డీఐ నాగేశ్వరరావు నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టింది. నిందితుడు మహేందర్, అతడి కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

ఇదిలా ఉండగా, ఈ యేడాది జనవరి 24న అదనపు కట్నం వేధింపులు తాళలేక.. అనంతపురంలో ఓ bank employee భార్య suicide చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరంలోని నేసేపేటకు చెందిన వెంకటకృష్ణ... తాడిమర్రిలోని SBI శాఖలో పనిచేస్తున్నాడు. 2016లో YSR District పొద్దుటూరు కు చెందిన కొండయ్య, గంగాదేవి  దంపతుల కుమార్తె వెంకట సుజన (26)ను పెళ్లి చేసుకున్నాడు. 

పెళ్లి సమయంలో రూ. 18 లక్షల కట్నం, 30 తులాల బంగారు నగలు సుజన తల్లిదండ్రులు అందజేశారు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా సృజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్ధలు చెలరేగి తరచుగా గొడవ పడేవారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి పైన మూడో అంతస్తులో సుజన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆదివారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అదనపు కట్నం కోసమే వేధింపులకు గురి చేసి.. తమ కుమార్తెను హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించారని వెంకటకృష్ణ కుటుంబ సభ్యులతో మృతురాలి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు డీఎస్పీ రమాకాంత్ కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... మృతురాలి భర్త ను అదుపులోకి తీసుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?