హైదరాబాద్ లో విషాదం.. పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బలవన్మరణం..

Published : Mar 31, 2023, 01:09 PM IST
హైదరాబాద్ లో విషాదం.. పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బలవన్మరణం..

సారాంశం

పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ శివారు నార్సింగిలో వెలుగు చూసింది. 

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడంతోనే అతను  బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ శివారులోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నార్సింగి అడ్మిన్ ఎస్సై బాలరాజు  ఈ మేరకు వివరాలను తెలియజేశారు.

వినోద్ కుమార్ (32) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇతను గుంటూరుకు చెందిన వ్యక్తి.  కొద్ది రోజుల క్రితం వరకు వర్క్ ఫ్రం హోం ఉండడం వల్ల గుంటూరు నుంచి పనిచేశాడు. ఇటీవలే ఆఫీసులు తెరవడంతో.. హైదరాబాద్ కు వచ్చాడు. అల్కాపూర్ లో ఉంటున్న తన సోదరుడి ఇంట్లో ఉంటూ ఆఫీస్ కు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. 

యేడాదిలో రూ. 6 లక్షల విలువైన ఇడ్లీలు ఆర్డర్ చేసిన హైదరాబాదీ, 8,428 ప్లేట్లు హాంఫట్...

కొత్తగా వస్తున్న టూల్స్, ఉద్యోగ నిర్వహణలో వాటి మీద పట్టు సాధించాల్సి రావడం వినోద్ కు ఇబ్బందిగా మారింది. ఒకటి నేర్చుకునే లోపే మరో కొత్త టూల్ వస్తుండడంతో ఒత్తిడికి గురవుతున్నాడు. ఇదే విషయాన్ని తన సోదరుడితో తరచుగా చర్చించేవాడని తెలిసింది. దీనికి తోడు ఉద్యోగ భద్రత లేకపోవడం అతడి ఒత్తిడిని మరింత పెంచింది. దీని తట్టుకోలేక గురువారం ఉదయం సోదరుడు, అతని భార్య బయటకు వెళ్లిన సమయంలో ఈ అఘాయిత్యానికి పూనుకున్నాడు. 

ఇంట్లో ఒంటరిగా ఉన్న వినోద్ కుమార్ దుప్పటితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపటికి ఇంటికి తిరిగి వచ్చిన సోదరుడు వినోదును గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయితే, అప్పటికే వినోద్ మృతి చెందాడు. వైద్యుడు అతడు మరణాన్ని ధ్రువీకరించారు. నార్సింగి పోలీస్ స్టేషన్లో దీనిమీద ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వినోద్ కు పెళ్లై భార్య, మూడేళ్ల కూతురు ఉంది. 

ఇదిలా ఉండగా, నేటి కాలంలో రీల్స్ చేయడం చిన్నా, పెద్దా అందరికీ ఓ అలవాటుగా మారిపోయింది. అలవాటు అనేకంటే అడిక్షన్ అనడం కరెక్టేమో. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రీల్స్ పిచ్చితో ఓ  తొమ్మిదేళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలోని తిరువళ్లువార్ కు చెందిన ప్రతిషా అనే అమ్మాయి  సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండేది. ప్రతిషా వయసు 9 సంవత్సరాలు. ఆ వయసులో చదువుకోకుండా రీల్స్ చేయడం సరికాదని తండ్రి ఆమెను మందలించాడు. చదువు మీద దృష్టి సారించాలని గట్టిగా చెప్పాడు. దీంతో చిన్నారి తీవ్ర మనస్థాపానికి గురైంది.

ఇంట్లో నుంచి తండ్రి బయటికి వెళ్ళగానే గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరి వేసుకుంది. ఇది గమనించిన ఇంట్లోని మిగతా కుటుంబ సభ్యులు వెంటనే ప్రతీషాను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆ చిన్నారిని పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా నిర్ధారించారు.  అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ఆ కుటుంబం శోకంలో మునిగిపోయింది. చదువుకోమని తండ్రి చెప్పడమే తప్పుగా మారింది.  ఈ విషాద ఘటన స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిమీద పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు