కెటిఆర్ ఈ పిలుపిస్తే ఇంకా సూపర్ కదా?

First Published Jul 21, 2017, 10:47 AM IST
Highlights
  • తన బర్త్ డే నాడు బొకేలు, ఫ్లెక్సీలు, తేవొద్దన్న కెటిఆర్
  • మొక్కలు నాటాలని కెటిఆర్ పిలుపు
  • అభినందనలు తెలపుతున్న పబ్లిక్
  • పనిలోపనిగా హైదరాబాద్ రోడ్ల గుంటలు పూడ్చేలా పిలుపివ్వాలంటున్న సోషల్ మీడియా

తెలంగాణ సిఎం కెసిఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కెటిఆర్ తన పుట్టినరోజు నాడు పూల బొకేలు తేవొద్దని అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. ఈనెల 24న ఆయన బర్త్ డే. ఆరోజున హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు కూడా పెట్టొద్దన్నారు. వాటికి బదులు కార్యకర్తలు, అభిమానులు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చాడు. దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు. కెటిఆర్ ను అభినందిస్తున్నారు.

కానీ సోషల్ మీడియా మరో మంచి సలహా ఇచ్చింది కెటిఆర్ కు. అదేమంటే హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు, బొకేలు వద్దన్నారు కాబ్టటి... ప్రతి కార్యకర్తకు రోడ్డు మీద ఉన్న ఒక గుంట అప్పగించి దాన్ని పూడ్చాలని పిలుపివ్వండి అంటోంది సోషల్ మీడియా. దానిద్వారా కెటిఆర్ జన్మదినం పేరుతో హైదరాబాద్ లో గుంటలమయమైన రోడ్లన్నీ సాఫ్ అయిపోతాయి అని సూచిస్తున్నారు. అసలే భారీ వర్షాలు పడి హైదరాబాద్ రోడ్లు మొత్తం పాడైపోయాయి. దీంతో కెటిఆర్ అభిమానులు, కార్యకర్తలు రంగంలోకి దిగితే ఎంతసేపు రోడ్లన్నీ బాగు కావడానికి అని సోషల్ మీడియా అంటున్నది.

మరి మనసున్న కెటిఆర్ గారు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు అయితది కానీ మీరు ఇంకొక్క పిలుపు ఇవ్వండి చాలు. లక్షల మంది ప్రయాణీకులు రిలాక్ష్ అయితరు. మీ పుట్టిన రోజున లక్షల మంది ప్రయాణీకులు దీవెనలు అందుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం సార్. ప్లీజ్ రెస్పాన్డ్....

click me!