
రోగం చిన్నదైనా చికిత్స మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇది నేడు ప్రైవేట్ ఆసుపత్రుల పరిస్థితి. డబ్బు కోసం అనవసరపు శస్త్రచికిత్సతో కూడిన కాన్పులు, అవసరం లేకున్నా ప్రతి చిన్న జబ్బుకు శస్త్రచికిత్సలు చేసి సామాన్యూడి జేబు ఖాళీ చేయిస్తున్నాయి. ఇది ఏ ఒక్క ఆసుపత్రిలో కాదు. దాదాపుగా అన్ని అసుప్రతులలో ఇలాగే ఉంది. అయితే ఇక మీదట ఇలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గురువారం కరీంనగర్ లో ఒక సభలలో మాట్లాడుతూ ఇక మీదట ప్రైవేట్ ఆసుపత్రులలో జరిగే ప్రతి శస్త్రచికిత్స కు ప్రభుత్వం కారణాలు అడుగుతుందని. ప్రతి నెలా తమ ఆసుపత్రులలో జరిగిన ఆపరేషన్ల వివరాలను కారణాలతో సహా అందించాలని ఆయన తెలిపారు. అవసరం లేకున్నా శస్త్రచికిత్సలు చేస్తే మాత్రం ఆసుపత్రుల పైన కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన తెలిపారు.
మరి కొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 39 డయాలసీస్ కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు మేలు జరగనుంది.