ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన యువకుడిని గుడ్డిగా నమ్మి మోసపోయింది ఓ యువతి. ఈ వ్యవహారం హైదరాబాద్ లో వెలుగుచూసింది.
హైదరాబాద్ : సోషల్ మీడియా పరిచయాలతో అనేకమంది చిక్కుల్లో పడుతున్నారు. కొందరు అమ్మాయిలు సోషల్ మీడియా స్నేహితుల చేతిలో లైంగిక వేధింపులు, మోసాలకు గురవుతున్నారు. ఇలాగే ఓ యువతి ఫేస్ బుక్ లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడింది. అయితే కొన్నాళ్లకు అతడి నిజస్వరూపం బయటడంతో దూరంపెట్టినా వేధింపులు మాత్రం తప్పలేదు. తనతో శారీరకంగా కలవాలని... లేదంటే గతంలో సన్నిహితంగా వున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేసాడు. దీంతో యువతి భయపడిపోయి అతడికి లొంగిపోకుండా పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన యువతి ఓ ప్రైవేట్ కంపనీలో పనిచేస్తూ హైదరాబాద్ లో నివాసముంటోంది. అదే జిల్లాకు చెందిన గోపి అనే యువకుడితో ఆమెకు ఫేస్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇదికాస్తా ప్రేమకు దారితీసింది. ఇద్దరిమధ్య తరచూ చాటింగ్, ఫోన్ సంబాషణలు సాగి సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో తనకు కూడా హైదరాబాద్ లో ఏదయినా ఉద్యోగం చూడాలని కోరడంతో తాను పనిచేసే కంపనీలోనే ఇప్పించింది. ఇలా ఇద్దరూ ఒకే దగ్గర ఉద్యోగం చేస్తూ మరింత దగ్గరయ్యారు.
undefined
Read More ఫేస్ బుక్ ప్రెండ్ తో యువతి నగ్నంగా వీడియో కాల్... అసలు కథంతా ఆ తర్వాతే..!
అయితే కొంతకాలంగా ప్రేమించిన యువతిని కాదని మరో యువతితో సన్నిహితంగా వుండసాగాడు. వారిమధ్య అక్రమసంబంధం కూడా సాగుతోందని అనుమానించిన యువతి ప్రియున్ని దూరం పెట్టింది. తరచూ ఖర్చులకు డబ్బులిచ్చే ప్రియురాలికి నిజస్వరూపం తెలిసి దూరంపెట్టడం గోపి తట్టుకోలేకపోయాడు. దీంతో గతంలో సన్నిహితంగా వుండగా దిగిన ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
గతంలో మాదిరిగానే తనతో సన్నిహితంగా వుండాలని... శారీరకంగా కూడా దగ్గరవ్వాలని ప్రియురాలిని గోపి బెదిరించడం ప్రారంభించాడు. తన కోరిక తీర్చకుంటే ఇద్దరం కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేయసాగాడు. కానీ అతడి బెదిరింపులకు భయపడని యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు గోపిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో వున్న అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.