కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఇలా: విలేకరుల కుర్చీల మధ్య మీటరు దూరం

By telugu teamFirst Published Mar 21, 2020, 4:16 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో సోషల్ డిస్టాన్స్ పాటించారు. మీడియా ప్రతినిధుల కుర్చీల మధ్య మీటరు దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. మీటరు దూరం ఉండడం ద్వారా జబ్బుకు దూరంగా ఉండవచ్చునని కేసీఆర్ అన్నారు.

హైదరాబాద్: కరోనా వైరస్ గురించి, జనతా కర్ఫ్యూ గురించి చెప్పడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మీడియా సమావేశంలో కూడా సోషల్ డిస్టాన్స్ ఏర్పాట్లు జరిగాయి. మీటరు దూరం ఉండేలా మీడియా ప్రతినిధుల కుర్చీలను ఏర్పాటు చేశారు. ప్రగతిభవన్ లో ఆయన శనివారం మీడియా ,సమావేశం ఏర్పాటు చేశారు. 

ప్రజలు పాటించాల్సిన నియమాలను, స్వయం నియంత్రణను ఆయన వివరించారు. మీటరు దూరంలో ఉండండి, జబ్బు మనకు రాదు అని ఆయన చెప్ాపరు. మనలను మనం రక్షించుకోవాలంటే ఆ పనిచేయక తప్పదని ఆయన అన్నారు. ఎక్కడికీ వెళ్లకపోతే మంచిదని, అత్యవసరమై వెళ్లితే మీటరు దూరం ఉండేలా చూసుకోవాలని ఆయన చెప్పారు. 

Also Read: ప్రధానిని హేళన చేస్తారా, ఇడియట్స్ .. కేసీఆర్ ఫైర్

60 ఏళ్ల పైబడిన వృద్ధులు, 10 ఏళ్ల లోపు వయస్సు గల పిల్లలు ఇళ్లలోనే ఉండాలని ఆయన సూచించారు. స్వయంనియంత్రణే కాపాడుతుందని ఆయన చెప్పారు. రేపటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని, అందువల్ల స్వయంనియంత్రణ పాటించడమే మార్గమని ఆయన చెప్పారు. ఇళ్లలోంచి బయటకు రాకపోతే మనలను మనం రక్షించుకోగలుగుతామని చెప్పారు. 

కరోనా వైరస్ స్వాభిమానం, స్వాతిశయం ఉన్న జబ్బు అని, మనం ఆహ్వానిస్తే  తప్ప అది మన వద్దకు రాదని, అందువల్ల దాన్ని ఆహ్వానించవద్దని ఆయన అన్నారు. ఇందుకు ప్రజల సహకారం అవసరమని ఆయన చెప్పారు. 

Also read:తెలంగాణలో 21 కరోనా కేసులు, 24 గంటల జనతా కర్ఫ్యా: కేసీఆర్

తీవ్రమైన పరిస్థితులు వస్తే ఇంటింటికీ సరుగులు అందించే పథకాన్ని కూడా రూపొందిస్తున్నామని, ఎలా చేయాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ ఆపద గట్టెక్కేదాకా ఎంత ఖర్చయినా చేస్తామని, ఎటువంటి చర్యలకైనా దిగుతామని ఆయన అన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామని ఆయన చెప్పారు. నయాపైసా ఖర్చు పెట్టుకోనీయమని ఆయన చెప్పారు. అవసరమైతే టోటల్ షటడవున్ ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

click me!