కేసిఆర్ హెలిక్యాప్టర్ లో పొగలు (వీడియో)

Published : Feb 27, 2018, 01:14 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
కేసిఆర్ హెలిక్యాప్టర్ లో పొగలు (వీడియో)

సారాంశం

సంచిలోంచి పొగలు రావడంతో సెక్యూరిటీ టెన్షన్ పొగలు చిమ్మే బ్యాగును దూరంగా పారేసిన సిబ్బంది వైర్ లెస్ సెట్ అమర్చిన బ్యాగులోంచి పొగలొచ్చినట్లు గుర్తించిన సెక్యూరిటీ

తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రయాణించే హెలిక్యాప్టర్ లో పొగలు వచ్చాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది టెన్షన్ పడ్డారు. వెంటనే అలర్ట్ అయ్యారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాలిలా ఉన్నాయి.

కెసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో ఉన్న ఒక బ్యాగ్ నుంచి పొగలు వచ్చాయి. హెలికాప్టర్ పైకి లేచే సమయం లో పొగలు రావడంతో సెక్యూరిటీ అప్రమత్తం అయ్యారు. పొగలు చిమ్మే బ్యాగును హెలిక్యాప్టర్ కు 100 మీటర్ల దూరంలో పరుగున వెళ్లి సిబ్బంది పారేశారు. హెలిక్యాప్టర్ లోని వైర్ లెస్ సెట్ అమర్చిన బ్యాగులో షాట్ సర్క్యూట్ తో మంటలు లేచాయంటున్నారు పోలీసులు.

పొగలు చిమ్మే బ్యాగును దూరంగా పడేసిన తర్వాత హెలిక్యాప్టర్ అక్కడినుంచి ఎగిరిపోయింది. ఆ వీడియోను కింద చూడొచ్చు.

PREV
click me!

Recommended Stories

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎంరేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం | Asianet News Telugu
Telangana Weatherman : ఎవరీ తెలంగాణ వెదర్ మ్యాన్? ఎప్పుడు, ఎక్కడ, ఎంత వర్షం పడుతుందో ముందే ఎలా చెబుతున్నాడు?