సింగరేణిలో టెన్షన్.. టెన్షన్.. (వీడియో)

First Published Feb 27, 2018, 12:29 PM IST
Highlights
  • సిఎం సభ పేరుతో భారీగా కార్మిక నేతల అరెస్టులు
  • అక్రమ అరెస్టులపై భగ్గుమన్న కార్మికులు
  • మందమర్రి పోలీసు స్టేషన్ ఎదురుగా ధర్నా

సింగరేణి మరోసారి వేడెక్కింది. పెద్ద సంఖ్యలో సింగరేణి కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దొరికినోళ్లను దొరికినట్లే అరెస్టు చేసి పడేశారు. సిఎం కేసిఆర్ పర్యటన నేపథ్యంలో ప్రత్యర్థి కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేశారు పోలీసులు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ మందమర్రి పోలీసు స్టేషన్ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. వెంటనే కార్మిక నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కోల్ బెల్ట్ ప్రాంతం అయిన శ్రీ రాంపూర్ లో సిఎం కేసిఆర్ భహిరంగ సభ సందర్భంగా బెల్లంపల్లి, మందమర్రి,  మంచిర్యాల, శ్రీరాంపూర్ ప్రాంతాల్లో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘ అధ్యక్షులు పార్వతి రాజిరెడ్డితో  పాటు కార్మిక బిడ్డల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, వివిద రాజకీయ పార్టీల నాయకులను అరెస్టు చేశారు.

దీంతో మందమర్రి పోలీసు స్టేషన్ ముందు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నేతలు ధర్నా నిర్వహించారు. ఒక వైపు ప్రభుత్వమే బొగ్గు బాయిలకు సెలవు ఇచ్చి సభను విజయవంతం చేయాలని టిఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తూ మరోవైపు అరెస్టులు చేయడమేంటని సంఘం కార్యదర్శి కామెర గట్టయ్య ప్రశ్నించారు. ధర్నా వీడియో కింద ఉండి చూడండి.

click me!