స్వితా సబర్వాల్ ట్వీట్‌పై నెటిజన్ల ఆగ్రహం.. సారీ చెబుతూ ట్వీట్ డిలీట్.. అసలేం జరిగిందంటే..

By Sumanth KanukulaFirst Published Sep 29, 2022, 4:46 PM IST
Highlights

తెలంగాణ సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఆ ట్వీట్ డిలీట్ చేసి.. క్షమాపణ తెలిపారు. 

తెలంగాణ సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఆ ట్వీట్ డిలీట్ చేసి.. క్షమాపణ తెలిపారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేస్తూ మరో ట్వీట్ చేశారు. అసలేం జరిగిందంటే.. స్మిత సబర్వాల్ ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా దేవి శరనవరాత్రుల సందర్భంగా ఆమె ఓ ట్వీట్ చేశారు.  ఈ తొమ్మిది రోజులు భారతదేశం అంతటా దాదాపు ఒకే విధమైన వివిధ అవతరాల్లో అమ్మవారిని పూజిస్తామని పేర్కొన్న స్మితా సబర్వాల్.. జెండర్ రిలేషన్‌ మాత్రం క్షేత్రస్థాయిలో చాలా వైవిధ్యంగా ఉందని చెప్పారు. 

దేశంలో రాష్ట్రాల వారీగా మహిళా-పురుష రేషియోను పోస్టు చేశారు. ఆ ట్వీట్‌లో ఇండియా మ్యాప్‌ను కూడా జత చేశారు. అయితే ఆ మ్యాప్‌లో కశ్మీర్ సంపూర్ణంగా కనిపించకపోవడంతో చాలా మంది నెటిజన్లు స్మితా సబర్వాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేశారు. దీంతో స్మితా సబర్వాల్ తాను చేసిన ట్వీట్‌ను తొలగించారు. అలాగే మరో ట్వీట్ ద్వారా వివరణ కూడా ఇచ్చారు. 

 

Since many of you found the tweet not acceptable, I delete it with apologies. Intention was not to hurt any sentiments. festivities to all 🙂🙏
Jai Hind 🇮🇳

— Smita Sabharwal (@SmitaSabharwal)

‘‘మీలో చాలామందికి ఆ ట్వీట్ ఆమోదయోగ్యం కాదని గుర్తించాను. నేను క్షమాపణలతో దానిని తొలగిస్తాను. ఎలాంటి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం లేదు. అందరికీ పండుగ శుభాకాంక్షలు. జై హింద్’’ అని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. ఇక, గతంలో కూడా స్మితా సబర్వాల్ చేసిన కొన్ని ట్వీట్స్‌పై పలువురు నెటిజన్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

click me!