పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు భేటీ: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన రాజాసింగ్

By narsimha lode  |  First Published Sep 29, 2022, 4:01 PM IST

రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేయడంపై పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు ఇవాళ సమావేశం నిర్వహించింది. పీడీ యాక్ట్ నమోదుపై రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. 


హైదరాబాద్:తనపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  అభ్యంతరం చెప్పినట్టుగా సమాచారం.  పీడీయాక్ట్ అడ్వయిజరీ బోర్డు సమావేశం గురువారం నాడు హైద్రాబాద్ లో జరిగింది.   పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు చైర్మెన్ భాస్కరరావు, మరో ఇద్దరు జడ్జిల  సమక్షంలో విచారణ సాగింది.ఈ సమావేశంలో రాజాసింగ్ భార్య ఉషాబాయ్,వెస్ట్ జోన్ డీసీపీ, మంగళ్ హాట్ , షాహినాయత్ గంజ్ పోలీసులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 25న పీడీయాక్ట్ నమోదు చేసి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు. పీడీ అడ్వైజరీ బోర్డు సమావేశంలో  చర్లపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజాసింగ్ పాల్గొన్నారు. 

పీడీ యాక్ట్ నమోదు చేయడంపై అభ్యంతరాలు చెప్పాలని  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బోర్డు చైర్మెన్ భాస్కరరావు కోరారు.పీడీ యాక్ట్  నమోదు చేయేడంపై రాజాసింగ్ అభ్యంతరం చెప్పారు. రాజాసింగ్ అభ్యంతరాలను ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన భార్య ఉషాబాయ్ సమర్ధించారు.అంతేకాదు కౌంటర్ ను కూడా దాఖలు చేశారు. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పై దాఖలు చేసేందుకు దారి తీసిన పరిస్థితులను పోలీసులు వివరించారు.  సుమారు గంటకు పైగా ఈ సమావేశం సాగింది. ఈ సమావేశం ముగిసిన నాలుగు రోజుల్లో బోర్డు ఆర్డర్ ను ఇచ్చే అవకాశం ఉంది. 

Latest Videos

పీడీ యాక్ట్ నమోదును బోర్డు సమర్ధిస్తే దాన్ని హైకోర్టులో  సవాల్ చేస్తామని రాజాసింగ్  తరపు న్యాయవాది కరుణసాగర్ చెప్పారు. పీడీ యాక్ట్ ను బోర్డు వ్యతిరేకిస్తే జైలు నుండి రాజాసింగ్ విడుదల చేసే అవకాశం ఉంది.రాజాసింగ్ పై నమోదైన వందకు పైగా కేసుల్లో అన్ని కూడా కొట్టివేసినట్టుగా కరుణసాగర్ చెప్పారు. కమ్యూనల్ కేసులు కూడ కొట్టివేశారని రాజాసింగ్ న్యాయవాది మీడియాకు చెప్పారు.

also read:రేపు పీడీ యాక్ట్ అడ్వైజరీ కమిటీ భేటీ: పాల్గొననున్న రాజాసింగ్

ఆగస్టు 22 వ తేదీన సోషల్ మీడియాలో  రాజాసింగ్ అప్ లోడ్ చేశాడు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపించింది. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఆయనను ఆగస్టు 23న అరెస్ట్ చేశారు. అదే రోజున నాంపల్లి కోర్టు రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ నెల 25న రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు చేసి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 


 

click me!