ఆమనగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

Published : Jul 08, 2019, 04:12 PM ISTUpdated : Jul 08, 2019, 04:49 PM IST
ఆమనగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

సారాంశం

రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ సమీపంలో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఐదుగురు మృతి మృతి చెందారు.


ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ సమీపంలో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఐదుగురు మృతి మృతి చెందారు.

వరంగల్ జిల్లా కాజీపేట మండలం మట్టెవాడ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్  తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంలో దైవ దర్శనం చేసుకొని  తిరిగి వస్తుండగా ఆమనగల్ కు సమీపంలోని మేడిగడ్డ వద్ద జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ ఖలీల్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్  దుర్గాప్రసాద్ ఆయన భార్య విజయలక్ష్మి, కొడుకు శంతన్, దుర్గాప్రసాద్ బావ రాజు అక్కడికక్కడే మృతి చెందారు.  మేడిగడ్డ వద్ద వే బ్రిడ్జి  వైపుకు వెళ్లేందుకు లారీ మలుపు తిరుగుతుండగా హైద్రాబాద్ వెళ్తున్న ఇన్నోవా ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్
చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?