స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం... ఆరుగురు గల్లంతు

Published : Oct 19, 2019, 07:54 AM ISTUpdated : Oct 19, 2019, 09:24 AM IST
స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం... ఆరుగురు గల్లంతు

సారాంశం

ఆస్పత్రిలో అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న విమలకొండ మహేశ్‌ వివాహానికి శుక్రవారం ఉదయం వీరంతా రెండు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా స్కార్పియో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తూ ఆనందంగా తిరిగి వస్తున్నారు. కానీ.. ఆ ఆనందం ఆవిరైపోయింది. కారు సాగర్ లోకి దూసుకువెళ్లి పోయింది. దీంతో... ఆరుగురు గల్లంతయ్యారు. ఈ సంఘటన కోదాడలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల గ్రామం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం (ఏపీ31 బిపి 338) అదుపుతప్పి నాగార్జున సాగర్‌ ఎడమ కాలువలో కి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు హైదరాబాద్‌ వాసులు గల్లంతయ్యారు. 

ఆస్పత్రిలో అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న విమలకొండ మహేశ్‌ వివాహానికి శుక్రవారం ఉదయం వీరంతా రెండు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా స్కార్పియో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

గల్లంతయిన వారంతా ఈసీఐఎల్‌లోని అంకుర ఆస్పత్రి ఉద్యోగులు అని తెలిసింది. గల్లంతయినవారిలో అబ్దుల్‌ అజిత్‌ (45), రాజేష్‌ 29), జాన్సన్‌ (33), సంతోష్‌ కుమార్‌ (23),నగేష్‌ (35) పవన్‌ కుమార్‌ (23) ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకుని పోలీసులు, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ తదితరులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గల్లంతయినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy: వంట చేసి విద్యార్థులతో కలిసి తిన్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
CM Revanth Reddy Inaugurates Telangana Public School | Breakfast Scheme Launched | Asianet Telugu