లోక్ సభ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్తులు మొదలు పెట్టింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లోక్ సభ ఎన్నికల గురించి మీడియాతో మాట్లాడారు. సిట్టింగ్ ఎంపీలకు సీట్లు కన్ఫమ్ అని ఎక్కడా చెప్పలేదని, అలాంటి చర్చ జరగలేదని వివరించారు.
Lok Sabha Elections: తెలంగాణలోని పార్టీలన్నీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించాయి. అటు వైపుగా వ్యూహాలు, కార్యచరణకు కసరత్తులు చేస్తున్నాయి. తెలంగాణ బీజేపీ కూడా కసరత్తులు మొదలు పెట్టింది. ఈ ఎన్నికల కోసం కొత్త ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది. లోక్ సభ ఎన్నికల గురించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయంబాపూరావు, కిషన్ రెడ్డికి కూడా లోక్ సభ ఎన్నికల్లో వారి స్థానాల నుంచి టికెట్లు కన్ఫామ్ అని దాదాపుగా అందరూ అనుకున్నారు. కానీ, తాజాగా, కిషన్ రెడ్డి ఈ వార్తలను కొట్టిపారేశారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారెంటీ అనే వార్తలు ఆధారరహితం అని కామెంట్ చేశారు.
undefined
అలాగే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో దళితుల కోసం రిజర్వేషన్ల వర్గీకరణ పోరాట నాయకుడు మంద క్రిష్ణ మాదిగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి మోడీకి, బీజేపీకి దళితులు మద్దతు ఇవ్వాలని, ఈ పార్టీనే వర్గీకరణ చేస్తుందని మంద క్రిష్ణ పిలుపు ఇచ్చారు. ఆ సభలో నరేంద్ర మోడీ, మంద క్రిష్ణ మాదిగలు ఉద్వేగభరితంగా వ్యవహరించారు. మాట్లాడారు.
Also Read: లీప్ డే ఫిబ్రవరి 29నే ఎందుకు వస్తుంది? లీప్ ఇయర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల్లో మందక్రిష్ణకు బీజేపీ టికెట్ కన్ఫమ్ అనే వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను కూడా కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. ఎన్నికల్లో ఆయన తమకు మద్దతు ఇచ్చిన మాట వాస్తవం అని వివరించారు. అయితే.. దాని కోసం ఇప్పుడు టికెట్ ఇస్తామని కచ్చితంగా చెప్పలేమని తెలిపారు.
అలాగే.. జనసేన గురించీ మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పొత్తు లోక్ సభ ఎన్నికల్లోనూ ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండకపోవచ్చని అన్నారు. అయితే, జనసేన ఎన్డీయేలో భాగస్వామేనని వివరించారు.